AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

commitment: మరో రచ్చ.. ట్రైలర్ అంతా బూతుమయం.. బ్యాక్‌గ్రౌండ్‌లో భగవద్గీత..

ఇటీవల కాలంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాల్లో చాలా సన్నివేశాలు, పాటలు వస్తున్న విషయం తెలిసిందే.

commitment: మరో రచ్చ.. ట్రైలర్ అంతా బూతుమయం.. బ్యాక్‌గ్రౌండ్‌లో భగవద్గీత..
Commitment
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2022 | 7:48 PM

Share

ఇటీవల కాలంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాల్లో చాలా సన్నివేశాలు, పాటలు వస్తున్న విషయం తెలిసిందే. దీని పై ఇప్పటికే చాలా మంది వ్యతిరేకతలు వ్యక్తం చేసి రచ్చ రచ్చ చేసిన విషయం కూడా తెలిసిందే. కేవలం సినిమాలతోనే కాకుండా ప్రయివేట్ ఆల్బమ్స్ లోనూ మనోభావాలు దెబ్బ తినేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. దేవుని పాటలను అశ్లీల పాటలకు, సన్నివేశాలకు వాడుకొని కొందరు వివాదాలను రేపుతున్నారు. ఇటీవలే సింగర్ శరవణ భార్గవి అన్నమయ్య కీర్తను అపహాస్యం చేశారంటూ జరిగిన రచ్చ మరువక ముందే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కమిట్మెంట్(commitment) అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో భగవద్గీత ప్రవచనం వినిపించారు. అశ్లీల సన్నివేశాలు చూపిస్తుండగా వెనక ‘మురికి చేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి యున్నది’ అంటూ భగవద్గీత ప్రవచనం వినిపించింది.

ఈ టీజర్ పై ఇప్పుడు రచ్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బూతు సన్నివేశాలకు భగవద్గీత ప్రవచనాలు యాడ్ చేశారు అంటూ మండిపడుతున్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటలను ఉద్దేశించి ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి