Ganesh Babu: నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నా.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్స్
చాలా కాలంగా సినిమాలు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.

బండ్ల గణేష్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల. అలాగే ఆ మధ్య రాజకీయాల్లోనూ చాలా చురుకుగా వ్యవహరించి హల్ చల్ చేశారు. చాలా కాలంగా సినిమాలు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఆయన తన అభిమానులతో పవన్ కళ్యాణ్ అభిమానులతో టచ్ లోనే ఉంటారు. పవర్ స్టార్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నట్టు ప్రకటించారు బండ్ల. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు..




..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్.. అంటూ ట్వీట్ చేశారు బండ్ల.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
…..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..?
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




