Thaman: రేపు థియేటర్లలో ఉంటది ర్యాంప్ ర్యాంప్.. జై బాలయ్య.. వైరల్ అవుతోన్న తమన్ ట్వీట్
కిక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమన్. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ జోరుతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు తమన్.

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా తన మ్యుజిక్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు తమన్. కిక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తమన్. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ జోరుతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు తమన్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్. వలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు తమన్. చిన్న చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే తమన్ అలవైకుంఠపురం లో సినిమాకు గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక ఈసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంగీతం అందించారు తమన్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అలాగే ఇప్పుడు బాలయ్య నటిస్తోన్న వీరసింహారెడ్డి సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అఖండ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు థియేటర్స్ దద్ధరిల్లాయి.ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య సినిమా కోసం అదిరిపోయే మ్యూజిక్ రెడీ చేస్తున్నాడు తమన్.
తాజాగా చేసిన ట్వీట్ ఈ మూవీపై మరింత హైప్ ఎక్కిస్తోంది. టీజర్ కు బీజీఎమ్ అదిరిపోయిందంటూ ఓ అభిమాని ట్వీట్ చేయగా.. దీనికి తమన్ స్పందించారు. ”ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే బ్రదర్.. రేపు థియేటర్లలో ఉంటది ర్యాంప్ ర్యాంప్.. కొన్ని సీన్లు చూసా.. వామ్మో.. జై బాలయ్య” అని ట్వీట్ చేశారు. దీనికి దర్శకుడు గోపీచంద్ మలినేని రియాక్ట్ అవుతూ.. కుమ్మేయ్ బావా అని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వీరసింహారెడ్డి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




