AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaarasudu: మహేష్ సినిమా మాదిరిగానే విజయ్ సినిమా స్టిల్స్.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న వారసుడు మూవీ పోస్టర్స్

ఇక  2007లో మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వంశీ. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

Vaarasudu: మహేష్ సినిమా మాదిరిగానే విజయ్ సినిమా స్టిల్స్.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న వారసుడు మూవీ పోస్టర్స్
Varasudu
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2022 | 8:24 AM

Share

దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో సినిమా చేస్తిన్న విషయం తెలిసిందే. ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు వంశీ. ఆతర్వాత వర్షం, మాస్ , భద్ర సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇక  2007లో మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు వంశీ. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి ఎవడు, నాగార్జున, కార్తితో కలిసి ఊపిరి , అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో  మహర్షి లాంటి సినిమాలను తెరకెక్కించారు. వంశీ చేసిన సినిమాలన్నీ మంచి హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా  మహేష్ నటించిన మహర్షి సినిమా మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ మూవీ అవార్డును అందుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నాడు వంశీ. ఈ సినిమాకు వారసుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్‌గా వర్కింగ్ స్టిల్స్ కొన్ని తమిళ్ మీడియా బయటకి వదిలింది. ఆ పిక్స్ చూస్తుంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి తీసిన ’మహర్షి‘ మూవీనే గుర్తొస్తోంది.

జయసుధ మదర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. విజయ్ గెటప్, మహేష్‌కి తల్లి భోజనం వడ్డించడం.. ఇలా పలు ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోట్లు అచ్చం మహేష్ మహర్షి సినిమాలో స్టిల్స్ లానే ఉన్నాయి. దాంతో దళపతి ఫ్యాన్స్ లో పలు అనుమానాలు మొదలవుతున్నాయి. మరి ఈ విషయం పై దర్శకుడు క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!