AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైన్స్ ఫిక్షన్..భారీ బడ్జెట్..బాల‌య్య రెడీ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ నెల 10న త‌న 60వ ప‌డిలోకి అడుగుపెట్ట‌నున్నారు. ప్రస్తుతం బాల‌య్య‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న‌ మూవీ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని..లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ మూవీకి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు మేక‌ర్స్. ఈ సినిమాలో న‌ట‌సింహం రెండు పాత్రల్లో క‌నువిందు చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫిల్మ్ త‌ర్వాత బాలయ్య ప్రాజెక్టు ఏంటంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఓ మలయాళ రీమేక్​తో […]

సైన్స్ ఫిక్షన్..భారీ బడ్జెట్..బాల‌య్య రెడీ..!
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2020 | 3:07 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ నెల 10న త‌న 60వ ప‌డిలోకి అడుగుపెట్ట‌నున్నారు. ప్రస్తుతం బాల‌య్య‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న‌ మూవీ ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని..లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ మూవీకి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు మేక‌ర్స్. ఈ సినిమాలో న‌ట‌సింహం రెండు పాత్రల్లో క‌నువిందు చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫిల్మ్ త‌ర్వాత బాలయ్య ప్రాజెక్టు ఏంటంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇప్పటికే ఓ మలయాళ రీమేక్​తో పాటు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే బోయపాటి మూవీ తర్వాత ఈ నందమూరి హీరో ‘ఆదిత్య 369’కు సీక్వెల్ చేసే ప్లానింగులో ఉన్నారట. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రాబోతున్న‌ ఈ సినిమా కథా చర్చలు ఇప్ప‌టికే పూర్తయినట్లు సమాచారం. ఇది సైన్స్ ఫిక్షన్​ మూవీ కావడం వల్ల భారీ బడ్జెట్​తో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.