టాలీవుడ్ నటుడు మురళీ శర్మకు మాతృ వియోగం..
ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీ శర్మ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి పద్మగారు గత రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీ శర్మ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి పద్మగారు గత రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. ఇక మురళీ శర్మ విషయానికి వస్తే.. ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిధి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే నంది అవార్డును తన ఖాతాలో వేసుకున్న గొప్ప నటుడు. ‘భలే భలే మగాడివోయ్’, ఈ ఏడాది విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో చేసిన పాత్రలు మురళీ శర్మకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Also Read:
ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..
పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..
మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!
కేంద్రం సంచలనం.. మహిళల వివాహ వయసు పెంపు?
నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
