Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు సచిన్‌ను ఔట్ చేశాక.. చంపుతామని బెదిరించారు..

ఆ మ్యాచ్‌లో తాను సచిన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసినందుకు, అంపైర్ రోడ్ టక్కర్ ఔటిచ్చినందుకు గానూ ఇద్దర్ని చంపుతామని బెదిరించారు. ట్విట్టర్ ద్వారా వేలాది మంది ఫ్యాన్స్‌ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయని బ్రెస్నన్ తెలిపాడు...

అప్పుడు సచిన్‌ను ఔట్ చేశాక.. చంపుతామని బెదిరించారు..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2020 | 2:16 PM

ఇట్స్ 2020.! కరోనా మహమ్మారి భారత్‌ను అల్లకల్లోలం చేస్తున్నా.. క్రేజీ క్రికెటర్ లవర్స్ మహేంద్రసింగ్ ధోని క్రికెట్ ఫ్యూచర్‌పై ఊహాగానాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఒకసారి మనం గతంలోకి వెళ్తే.. 2011లో తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూసింది.

నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై 99వ సెంచరీ కొట్టిన సచిన్.. ఆ తర్వాత వరుసగా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు. అయితే 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో అంతా అనుకున్నట్లుగానే జరిగింది. సచిన్ 100వ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే అప్పుడే ఊహించని విధంగా ఇంగ్లాండ్ పేసర్ టిమ్ బ్రెస్నన్ బౌలింగ్‌లో సచిన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ బ్రెస్నన్ తాజాగా మీడియాతో పలు విషయాలను పంచుకున్నాడు.

‘ఆ మ్యాచ్‌లో తాను సచిన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసినందుకు, అంపైర్ రోడ్ టక్కర్ ఔటిచ్చినందుకు గానూ ఇద్దర్ని చంపుతామని బెదిరించారు. ట్విట్టర్ ద్వారా వేలాది మంది ఫ్యాన్స్‌ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయని బ్రెస్నన్ తెలిపాడు. అంపైర్ రోడ్ టక్కర్‌కు అయితే ఏకంగా ఇంటికే బెదిరింపు లేఖలను పంపించారన్నాడు. ‘నీకు ఎంత ధైర్యం ఉంటే సచిన్‌ను ఔట్ చేస్తావ్’.? అసలు ఆ బంతి లెగ్ స్టంప్‌ను పూర్తిగా మిస్ అయిందంటూ’? రాసేవారని టిమ్ గుర్తు చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతన్ని నేను కలిస్తే.. భయమేసి పోలీసులను సెక్యూరిటీగా పెట్టుకున్నట్లు రోడ్ టక్కర్ తనకు చెప్పాడని బ్రెస్నన్ వివరించాడు. ఏది ఏమైనా క్రికెట్ గాడ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అంటే.!

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

కేంద్రం సంచలనం.. మహిళల వివాహ వయసు పెంపు?

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..