బాలయ్య 46 ఏళ్ల సినీ కెరీర్​ : నారా రోహిత్ స్పెష‌ల్ ట్వీట్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి నేటితో 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద‌ర్బంగా చిత్ర ప్ర‌ముఖులు ఆయ‌న శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 2:25 pm, Sun, 30 August 20
బాలయ్య 46 ఏళ్ల సినీ కెరీర్​ : నారా రోహిత్ స్పెష‌ల్ ట్వీట్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి నేటితో 46 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద‌ర్బంగా చిత్ర ప్ర‌ముఖులు ఆయ‌న శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అన్న ఎన్టీఆర్ వార‌స‌త్వాన్ని అద్బుతంగా నిల‌బెట్టి కొన‌సాగిస్తోన్న‌ ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బాల‌కృష్ణ‌ను ఉద్దేశించి నారా రోహిత్ ట్వీట్ చేశారు.

“నువ్వు హీరో అయితే నీ అభిమానిగా ఉంటాం, నువ్వు దేవుడు అయితే నీ భక్తులుగా ఉంటాం. నువ్వు నాయకుడివి అయితే నీ సేవకుడిలా ఉంటాం. ఏది ఏమైనా మా చివరి శ్వాస ఉన్నంత వరకు నీ వెనకే ఉంటాం . 46 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని, నందమూరి అభిమానులని అలరిస్తున్న మా బాలయ్య మామకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జై బాలయ్య !! జై జై బాలయ్య !!” అని నారా రోహిత్ పేర్కొన్నారు.

Also Read :

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1

మనోజ్ఞ మృతదేహానికి కరోనా పరీక్షలు, ఫ‌లితం ఏంటంటే