“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

మీకో విషయం తెలుసా. మ‌న తెలుగు హీరోల్లో చాలామందికి తెలుగు రాయ‌డం, చ‌ద‌వ‌డం రాదు. ఇక హీరోయిన్ల సంగ‌తి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు.

తాత వల్లే తెలుగు నేర్చుకున్నా
Follow us

|

Updated on: Aug 30, 2020 | 9:40 AM

మీకో విషయం తెలుసా. మ‌న తెలుగు హీరోల్లో చాలామందికి తెలుగు రాయ‌డం, చ‌ద‌వ‌డం రాదు. ఇక హీరోయిన్ల సంగ‌తి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల్లో వారు పెర‌గ‌డ‌మే ఇందుకు ప్రధాన కార‌ణం. ఇప్పుడున్న ద‌ర్శ‌కులు కూడా స్క్రిప్ట్‌ను ఇంగ్లీషులోనే రాసుకుంటున్నారు. అయితే కొంత‌మంది హీరోల త‌ల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ తెలుగు భాష‌పై మ‌క్కువ‌తో చిన్నత‌నంలోనే వారికి తెలుగు నేర్చుకునేలా ప్రొత్స‌హించారు. అలాంటి వారిలో యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా ఒక‌రు. అల‌నాటి ప్ర‌ముఖ క‌మెడియ‌న్ దివంగ‌త అల్లు రామ‌లింగయ్య గారి మ‌న‌వ‌డే అల్లు శిరిష్. తాను తెలుగు నేర్చుకోడానికి త‌న తాతే కార‌ణమంటూ తేల్చి చెప్పేశాడు శిరీష్. ‌

చెన్నై స్కూల్లో తమకు హిందీ, తమిళం మాత్రమే నేర్పించేవార‌ని.. కానీ, తెలుగు రావాలని త‌న‌ తాత కోరుకునేవారని వెల్ల‌డించాడు. తాతయ్యే తమకు స్పెష‌ల్ తెలుగు ట్యూషన్లను పెట్టించి భాష‌పై అవ‌గాహ‌న పెంపొందించార‌ని వివరించాడు. ఆయన తర్వాత ఆ బాధ్య‌త‌ను త‌న త‌ల్లి తీసుకుందని.. మన భాష, సంస్కృతిని నేర్పిన వారిద్దరికీ థ్యాంక్స్ చెప్పాడు శిరీష్. తెలుగువారందరికీ శ‌నివారం రోజున‌ తన తరఫున తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాడు ఈ యంగ్ హీరో.

Also Read : ‘డియర్‌ కామ్రేడ్’ అరుదైన ఘ‌న‌త‌ : ఇండియాలోనే నెం.1