విలన్‌ రోల్స్ చేసేందుకు రెడీ అంటోన్న నివేదా

ఈ సినిమాలోని 'అపూర్వ అనే క్రైమ్ నవలా రచయితగా' కనిపిస్తానని తెలిపింది. అలాగే ఓటీటీ కోసం వర్క్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, మంచి నటిగా గుర్తింపు ఉంటే చాలని చెప్పుకొచ్చింది. ఇక విలన్‌గా చేసే అవకాశం వస్తే చేయడానికి సిద్ధమేనని...

  • Tv9 Telugu
  • Publish Date - 1:58 pm, Sun, 30 August 20
విలన్‌ రోల్స్ చేసేందుకు రెడీ అంటోన్న నివేదా

ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ స్టార్‌డమ్ క్రియేట్ చేసుకుంది నివేదా. మొదటి నుంచీ సెలక్టివ్ రోల్స్ చేస్తూ.. నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తోంది. ఇక లేటెస్ట్‌గా నివేదా థామస్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ”వి”లో నటించింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ఓటీటీలో ఇది రిలీజ్ కానుంది. ఇందులో నాని, సుధీర్‌ బాబులు కలిసి నటించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ వేదికగా మీడియాతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలోని ‘అపూర్వ అనే క్రైమ్ నవలా రచయితగా’ కనిపిస్తానని తెలిపింది. అలాగే ఓటీటీ కోసం వర్క్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, మంచి నటిగా గుర్తింపు ఉంటే చాలని చెప్పుకొచ్చింది. ఇక విలన్‌గా చేసే అవకాశం వస్తే చేయడానికి సిద్ధమేనని, నెగిటివ్ షేడ్ పాత్రల్లో నటించడానికి ఎదురుచూస్తున్నా అని తెలిపింది. నెగిటివ్ రోల్ అనేది చాలా విశాలమైనది. ఒకరిని కొట్టి విలనిజం చూపించుకోవాలని ఏమీ లేదు. మెదడు ద్వారా ఆలోచిస్తూ, టాక్టికల్‌గానూ చేయవచ్చని చెప్పుకొచ్చింది నివేదా థామస్.

Read More:

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్