జగన్ కి నాగార్జున దీవెనలు

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జున పుట్టిన రోజుకి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ రంగానికి చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతోపాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగ్ కు విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 2:44 pm, Sun, 30 August 20
జగన్ కి నాగార్జున దీవెనలు

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జున పుట్టిన రోజుకి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. సినీ రంగానికి చెందిన చిన్నా, పెద్ద ప్రముఖులతోపాటు వివిధ రంగాలకు చెందినవాళ్లు నాగ్ కు విషెస్ చెప్పారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాగార్జునకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ‘తెలుగు సినిమా ఎంతో ఆరాధించిన నటులలో ఒకరైన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. భవిష్యత్ లో కూడా మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు సిద్ధించేలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అంటూ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.

దాదాపు 19 గంటల తర్వాత జగన్ బర్త్డే మెసేజ్ పై నాగార్జున స్పందించారు. ‘ప్రియమైన.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమపూర్వకమైన సందేశానికి ధన్యవాదాలు.. మీ డైనమిక్ లీడర్ షిప్ లో ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని ఆకాంక్షించారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం లభించేలా దేవుడు దీవిస్తాడని నాగార్జున రిప్లై ఇచ్చారు.