Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాకు మరో బిగ్ షాక్.. సెన్సార్ బోర్డుకు వరుసగా లేఖలు
రాకింగ్ స్టార్ యశ్నటించిన 'టాక్సిక్' సినిమా టీజర్ జనవరి 08న విడుదలైంది. అయితే ఈ టీజర్‌లో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండడం భిన్న వాదానలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 'టాక్సిక్' టీజర్‌పై కొన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి. లేటెస్ట్ గా CBFC (సెన్సార్ బోర్డు)లో కూడా ఈ మూవీపై ఫిర్యాదు నమోదైంది.

యశ్ ‘టాక్సిక్’ సినిమా టీజర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. టీజర్ హాలీవుడ్ లెవెల్ లో ఉందని ప్రశంసలు వినిపిస్తున్నప్పటికీ, అనవసరమైన రొమాంటిక్ సీన్లు జోడించారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటి మధ్య టాక్సిక్ సినిమా వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం (జనవరి 12) ‘టాక్సిక్’ సినిమాపై కొందరు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇదే సినిమా విషయంలో కొందరు సెన్సార్ బోర్డు (CBFC) కు కూడా ఫిర్యాదు చేశారు. ‘టాక్సిక్’ సినిమా టీజర్‌లో అశ్లీల, అనైతిక సన్నివేశాలు ఉన్నాయన్నది చాలా మంది ఫిర్యాదు. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త దినేష్ కల్లహల్లి సెన్సార్ బోర్డు (CBFC)కి ఫిర్యాదు చేశారు. టీజర్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని, ఇవి మైనర్లపై చెడు ప్రభావం చూపుతాయని దినేష్ కల్లహల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమా టీజర్ సామాజిక నైతికత హద్దులు దాటిందని, కాబట్టి ఈ సన్నివేశాలను వెంటనే తొలగించాలని, సినిమా దర్శక, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దినేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘టాక్సిక్’ సినిమాపై కర్ణాటక ఆప్ మహిళా విభాగం మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సినిమా టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అశ్లీలంగా ఉన్నాయని ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వయస్సు హెచ్చరిక లేకుండా పబ్లిక్ డొమైన్‌లో విడుదల చేసిన ఈ దృశ్యాలు మహిళల గౌరవాన్ని కించపరిచేవిగా, కన్నడ సంస్కృతిని అవమానించేవిగా ఉన్నాయని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ మండి పడ్డారు.
టాక్సిక్ సినిమాలో రుక్మిణీ వసంత్..
Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in – A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu
— Yash (@TheNameIsYash) January 6, 2026
మరోవైపు టాక్సిక్ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ చిత్రానికి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి కథానాయికలుగా నటించారు.
టాక్సిక్ సినిమా టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




