Baby Movie: మ్యూజిక్ లవర్స్ మనసులను హత్తుకుంటున్న అద్భుతమైన మెలోడీ సాంగ్.. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాటకి అద్భుతమైన రెస్పాన్స్..
ఇటీవల బేబీ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ "ఓ రెండు ప్రేమ మేఘాలిలా" పాట స్పోటిఫై వంటి మ్యూజిక్ యాప్స్ తో పాటు యూట్యూబ్ లో టాప్ 5లో ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. బిఫోర్ రిలీజ్ ఈ సినిమా మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. అయితే ఈ సినిమా ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను కట్టిపడేస్తుంది. ఇటీవల బేబీ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” పాట స్పోటిఫై వంటి మ్యూజిక్ యాప్స్ తో పాటు యూట్యూబ్ లో టాప్ 5లో ట్రెండ్ అవుతోంది.
మొట్ట మొదటిసారి విన్న వెంటనే నచ్చే విధంగా సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఇచ్చిన ట్యూన్ ఇన్ స్టెంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ పాటలో ఫీల్ తోపాటు.. పిల్లల కోరస్.. సింగర్ శ్రీరామచంద్ర ఆలపించడం మరింత హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ పాటకు 3 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
స్టార్స్ సినిమాలైన “వాల్తేరు వీరయ్య”, “వీరసింహారెడ్డి” “పఠాన్” వంటి హై ఎక్సెపెక్టెడ్ క్రేజీ మూవీస్ తో పాటు బేబీ సినిమా పాట శ్రోతల ఆదరణ పొందడం సినిమా మ్యూజిక్ ఎక్స్ లెన్స్ ను చూపిస్తోంది. ఓ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో దాన్ని ఫుల్ ఫిల్ చేశారు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్. ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
