AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Engineering Colleges: బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజులు భారీగా తగ్గించిన ప్రభుత్వం.. ఒకేసారి ఎంతంటే..?

తెలంగాణలోని బీటెక్ విద్యార్థులకు శుభవార్త. కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా తగ్గాయి. మరికొన్ని కళాశాలల్లో పెరిగాయి. ఈ మేరకు ఫీజులను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని కాలేజీల్లో రూ.40 వేల వరకు ఫీజులు తగ్గాయి. ఆ వివరాలు..

Engineering Colleges: బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజులు భారీగా తగ్గించిన ప్రభుత్వం.. ఒకేసారి ఎంతంటే..?
Students
Venkatrao Lella
|

Updated on: Feb 18, 2026 | 7:21 AM

Share

ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను భారీగా తగ్గించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న ఫీజుల్లో కొత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025-28 మూడు సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ఫీజు సవరణ 2025-26 విద్యా సంవత్సరంలో జరగాల్సి ఉంది. అయితే విద్యా సంవత్సరం ముగియడానికి సమయం దగ్గర పడుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేయకపోవడంతో హైకోర్టును కాలేజీలు ఆశ్రయించాయి. ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ నడుస్తుండగా.. ప్రభుత్వం ఫీజులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోంది. దీంతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.

19 కాలేజీల్లో ఫీజు తగ్గింపు

అనేక ప్రైవేట్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సు ఫీజులను తెలంగాణ ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ఫీజుల్లో ఇప్పుడు కొత విధించింది. దాదాపు 19 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నల్లమల్లరెడ్డి కళాశాలకు అత్యధికంగా రూ.45 వేలు తగ్గించగా.. గురునానన్ ఇంజనీరింగ్, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇంజినీరింగ్ కాలేజీలకు రూ.43 వేలు, రూ.35,100 తగ్గింది. ఇక సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో రూ.23,800 తగ్గించారు. సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్, విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ, MLRIT కాలేజీల్లో ఫీజులకు కొత విధించారు.

వీటిల్లో ఫీజులు పెంపు..

ఇక మరికొన్ని కాలేజీల్లో ఫీజులను పెంచగా.. ఇంకొన్ని కాలేజీల్లో యథావిధిగా ఉంచింది. జి నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో రూ.62 వేలు ఫీజు పెంచగా.. వాసవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో రూ.35 వేలు, గోకరాజు గంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రూ.30,500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 63 కాలేజీల్లో ఫీజులు పెంచగా.. 70 కాలేజీల్లో పాత ఫీజునే కొనసాగించారు. ఫీజులను సవరించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యూలేటరీ కమిటీ కొత్త ఫీజులపై తెలంగాణ ప్రభుత్వానికి సిఫారస్సులు పంపింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఫీజులను సవరించింది.  కాగా ఈ ఫీజుల సవరణపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీల్లో ఫీజులు తగ్గించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫీజులు తగ్గించిన మొత్తం 19 కళాశాలల్లో దాదాపు 15 కళాశాలలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందినవే ఉన్నాయి.

Follow Us
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
వరి పొలం కోస్తుండగా కనిపించిన గూడు.. లోపల
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
పర్సనల్‌ లోన్‌ రిజెక్ట్‌ అయితే రెండోసారి ఎలా అప్లై చేయాలి?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..?
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఘోరం.. తండ్రి మృతి, కొడుకు పరిస్థితి
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదాద్రి.. స్పెషల్ ఏంటంటే?”
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాదాద్రి.. స్పెషల్ ఏంటంటే?”
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి పువ్వు..
ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి పువ్వు..
ఎంత అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
ఎంత అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో నటి పావల శ్యామల..
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం
ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం
SSY నుంచి డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చా?
SSY నుంచి డబ్బులు ముందుగానే విత్‌డ్రా చేసుకోవచ్చా?
ఇదో మ్యాజికల్ చెట్టు.. ప్రతి కొమ్మకు తేనెపట్టు..
ఇదో మ్యాజికల్ చెట్టు.. ప్రతి కొమ్మకు తేనెపట్టు..