మీ స్మార్ట్‌ఫోన్ స్లో అయిందా? ఈ సింపుల్ టిప్స్‌తో మీ పాత ఫోన్‌ను కొత్తదానిలా మార్చేయండి!
స్మార్ట్‌ఫోన్ మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ పనుల నుండి వినోదం వరకు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇంతటి కీలకమైన పరికరం మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు స్లో అయినా లేదా స్క్రీన్ ఫ్రీజ్ అయినా చాలా కోపం వస్తుంది.

ఫోన్ ఎందుకు స్లో అవుతుందో అర్థం కాక చాలామంది కొత్త ఫోన్ కొనాలని అనుకుంటారు. కానీ కొత్త ఫోన్ కొనాల్సిన పని లేకుండానే కొన్ని చిన్న మార్పులతో మీ మొబైల్ వేగాన్ని పెంచవచ్చని తెలుసా!
- ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా స్లోగా పనిచేస్తున్నప్పుడు వెంటనే చేయాల్సిన మొదటి పని ‘రీస్టార్ట్’. మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల బ్యాగ్రౌండ్‌లో అనవసరంగా రన్ అవుతున్న యాప్స్ అన్నీ ఆగిపోతాయి. ఇది ప్రాథమిక సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది.
- చాలామంది డేటా ఖర్చు అవుతుందని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను వాయిదా వేస్తుంటారు. పాత వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఉండటం వల్ల ఫోన్ పనితీరు తగ్గుతుంది. అంతేకాకుండా మాల్వేర్ వంటి వైరస్లు ఫోన్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్లను ఇన్ స్టాల్ చేయడం వల్ల ఫోన్ సెక్యూరిటీతో పాటు వేగం కూడా పెరుగుతుంది.
- మొబైల్ స్టోరేజ్ నిండిపోతే ఆ ప్రభావం నేరుగా ప్రాసెసర్ మీద పడుతుంది. అందుకే ఫోన్ స్టోరేజ్ లో కనీసం 40 శాతం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన ఫోటోలు, వీడియోలు, ఎప్పుడో డౌన్‌లోడ్ చేసి వాడకుండా ఉంచిన యాప్స్ వెంటనే డిలీట్ చేయండి. స్టోరేజ్ ఎంత ఫ్రీగా ఉంటే ఫోన్ అంత స్మూత్ గా పనిచేస్తుంది.
- ప్లే స్టోర్ లో కాకుండా బయట దొరికే ఏపీకే (APK) ఫైల్స్ ఇన్ స్టాల్ చేయడం, తెలియని ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌లను వాడటం వల్ల ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫోన్ బ్యాగ్రౌండ్ లో డేటా చోరీ జరుగుతూ మొబైల్ విపరీతంగా స్లో అవుతుంది. అందుకే నమ్మదగిన యాప్స్ మాత్రమే వాడటం మంచిది.
పైన చెప్పిన చిట్కాలన్నీ పాటించినా ఫోన్ ఇంకా స్లోగానే ఉంటే చివరి ప్రయత్నంగా ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయాలి. దీనివల్ల మీ ఫోన్ మీరు కొన్నప్పుడు ఎలా ఉండేదో మళ్ళీ అలాగే మారుతుంది. అయితే ఈ పని చేసే ముందు మీ ఫోన్ లో ఉన్న ముఖ్యమైన ఫోటోలు, ఫైల్స్ అన్నీ మరో డివైస్ లో బ్యాకప్ తీసుకోవాలి. రీసెట్ చేసిన తర్వాత ఫోన్ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్ అనేది ఒక యంత్రం. దానిని కూడా మనం జాగ్రత్తగా నిర్వహించాలి. పైన చెప్పిన సూచనలు పాటిస్తే మీ మొబైల్ ఖచ్చితంగా వేగంగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు క్యాచీ డేటా క్లియర్ చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
