AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Cleaning Tips: చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయమవ్వాల్సిందే!

చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి అయినప్పటికీ వీటిని తినేందుకు కొందరు ఇష్టపడుతారు, మరి కొందరు అవైడ్ చేస్తారు. ఎందుకంటే వీటిలో ముళ్లుంటాయని కొందరు బయపడితే, మరి కొందరు దాని కౌసు వాసన వల్ల ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి చేపలను సరిగ్గా శుభ్రం చేస్తే వాటి వాసన మొత్తం చిటికలో పోతుంది. అప్పుడు మీరు ఎలాంటి కౌసు వాసన లేకుండా చేపల కర్రీని ఎంజాయ్ చేయవచ్చు.

Fish Cleaning Tips: చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయమవ్వాల్సిందే!
How To Remove Fish Smell
Anand T
|

Updated on: Feb 18, 2026 | 7:00 AM

Share

నాన్‌వెజ్ తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో నివసించే జనాలు సీ ఫుడ్స్ అంటే సముద్రంతో దొరికే చేపలను ఎక్కవుగా ఇష్టపడుతారు. ఈ చేపలు రుచితో పాటు మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేపలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి తక్కువ కొవ్వు పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ డి, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు ఆరోగ్యం, కళ్ళు, ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొంతమంది చేపల నుంచి వచ్చే కౌసు వాసన కారణంగా వాటిని తినడానికి వెనుకాడతారు. కానీ మీరు సరైన పద్దతిలో చేపలను శుభ్రం చేస్తే అవి అస్సలు వాసన రావు. అదేలానో ఇప్పుడు చూద్దాం.

చేపలు వాసన రాకుండా ఎలా కడగాలిఞT

అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు: చేపల వాసన రాకుండా ఉండాలంటే, చేపలను శుభ్రం చేసిన తర్వాత వాటికి ఉప్పు, అల్లం పేస్ట్ కలిపి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత రెండు లేదా మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకోండి. ఇది దుర్వాసన కలిగించే సమ్మేళనాలను తొలగిస్తుంది.

ఉప్పు, పసుపు: చేపలను కోసిన తర్వాత, ఉప్పు, పసుపులో నానబెట్టండి. ఈ రెండు పదార్థాలు సహజంగా చేపల నుండి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, దుర్వాసనను తొలగిస్తాయి.

ఉప్పు నీరు: చేపల వాసన, జిడ్డును తొలగించడానికి ఉప్పు నీటిని ఉపయోగించవచ్చు. దీని కోసం, మొదట చేపలను బాగా శుభ్రం చేసి, ఉప్పు నీటిని ఒక కంటైనర్‌లో వేసి, దానికి చేపను వేసి, కొంత సమయం అలాగే ఉంచండి, చేపలను రెండు మూడు సార్లు శుభ్రమైన నీటితో కడగండి, ఇలా చేస్తే చేపల వాసన పూర్తిగా మాయమవుతుంది.

వెనిగర్: చేపలను ఉప్పు నీటిలో శుభ్రం చేసినట్లే, నీటిలో కొద్దిగా వెనిగర్ వేసి చేపలను శుభ్రం చేయవచ్చు. ఇది చేపల వాసనను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ప్రత్యామ్నాయంగా, మీరు చేపలను నిమ్మరసం లేదా వెనిగర్‌లో 10 నిమిషాలు నానబెట్టి, ఆపై శుభ్రమైన నీటితో శుభ్రం చేసినా వాసన పోతుంది

పిండి, నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, సగం నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలలి పేస్ట్‌లా తయారు చేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని చేపలకు అప్లై చేసి రెండు నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత రెండు మూడు సార్లు నీటిలో బాగా కడగండి. దీనివల్ల చేపల వాసన పూర్తిగా తొలగిపోతుంది. అంతే కాదు చేపలను పాలలో 25 నుండి 30 నిమిషాలు నానబెట్టడం ద్వారా కూడా వాటి వాసనను తొలగించవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..