AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold And Silver Price: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. రికార్డ్‌ స్థాయి నండి పతనమైన ధరలు..

పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..ఎందుకంటే.. గత ఏడాది కాలంగా భగ్గుమంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. 2026 ఆరంభం నుండి పసిడి పతనం దిశగా ప్రయాణిస్తూ వస్తోంది. ఒకప్పుడు ఆల్‌టైమ్‌ హైక్‌ వెళ్లిన బంగారం రికార్డు ధరలను క్రియేట్‌ చేసింది. ఏకంగా రెండు లక్షలకు చేరువలోకి వెళ్లింది. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోయారు. బంగారం ఇక మ్యూజియంలోనే చూడాల్సి వస్తుందేమోనని భయపడిపోయారు. కానీ, పుత్తడి పరుగులకు ఇప్పుడు కళ్లెం పడుతోంది..

Gold And Silver Price: బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్.. రికార్డ్‌ స్థాయి నండి పతనమైన ధరలు..
Gold
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2026 | 8:14 AM

Share

వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. పైగా మూఢం కూడా పూర్తైంది.. ఇప్పుడన్నీ మంచిరోజులే.. దీనికి తోడుగా బంగారం కూడా ప్రజల్ని ఊరిస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగా తగ్గాయి. కొనే వారికి ఇదే సూపర్ టైం అంటున్నారు నిపుణులు. గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 18 బుధవారం నాటికి పసిడి ధరలు మరింత తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,54,190లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,41,340లకు పడిపోయింది.

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,210 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,190 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

ఇవి కూడా చదవండి

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,340 క్యారెట్ల ధర రూ.1,41,490 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– విజయవాడలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఇక వెండి విషయానికి వస్తే..ఇవాళ్ల వెండి ధర గ్రాము 279.90లకు చేరింది. దీంతో కిలో వెండి ఇప్పుడు రూ2,79,900లుగా కొనసాగుతోంది.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us