ఉద్యోగుల కోసం స్వర్ణోత్సవం.. గోల్డ్‌తో సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ..100మందికి పైగా జాక్‌పాట్..!
సాధారణంగా ప్రజల్లో తాము పనిచేస్తున్న కంపెనీ సంస్కృతి పట్ల తరచూగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అలాంటి ఫిర్యాదులు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. కానీ, ఒక కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు మాత్రమే కాదు.. నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ తన 32వ వార్షికోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయం అందరి అంచనాలను మార్చివేసింది. తమ కంపెనీలో 10 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఉద్యోగులను కోట్లాది రూపాయల విలువైన బంగారు మెమెంటోలను బహుకరించి సత్కరించింది. ఈ ప్రత్యేకమైన చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

సింగపూర్‌లోని ఒక కంపెనీ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆ కంపెనీలో చాలా కాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు విలువైన బంగారు మెమెంటోలను బహుమతిగా ఇచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కంపెనీ దీని కోసం దాదాపు రూ. 3.5 కోట్లు ఖర్చు చేసింది. ఈ కంపెనీ చాంగ్ చెంగ్ హోల్డింగ్స్. కంపెనీలో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు మెమెంటోలను బహుకరించింది.
ఈ బంగారు ఫలకాలు 20 నుండి 30 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. ప్రతి ఫలకం విలువ 3 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. కంపెనీ ఈ చర్యతో తన ఉద్యోగుల కృషి, విధేయతను గౌరవించడానికే అని చెబుతోంది. చాంగ్ చెంగ్ హోల్డింగ్స్ 1994లో ఒక చిన్న ఆహార దుకాణంగా ప్రారంభమైంది. క్రమంగా, కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. నేడు అది సింగపూర్ 160 రెస్టారెంట్లు, 30 కి పైగా కాఫీ షాపులను నిర్వహిస్తోంది.
ఈ కంపెనీ ప్రస్తుతం 1,200 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. దాని 32వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కంపెనీ 100 కి పైగా టేబుళ్లను ఏర్పాటు చేయగలిగిన ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు 999-స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మెమెంటోలను బహుకరించారు. కంపెనీ లోగో, ప్రధాన కార్యాలయం డిజైన్, ఉద్యోగి సంవత్సరాల సేవలను కలిగి ఉన్న ఈ ఫలకాలను విలక్షణమైన ఎరుపు రంగు గిఫ్ట్ బాక్స్‌తో ప్యాక్ చేశారు. ఇది వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
View this post on Instagram
సమాచారం ప్రకారం, 10 నుండి 14 సంవత్సరాలు పనిచేసిన వారికి 20 గ్రాముల బంగారం, 15 నుండి 19 సంవత్సరాలు పనిచేసిన వారికి 25 గ్రాములు, 20 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి 30 గ్రాముల గోల్డ్ మెమెంటో లభించింది. ఈ బహుమతుల మొత్తం విలువ సుమారు 500,000 సింగపూర్ డాలర్లు. అంటే సుమారు రూ.3.5 కోట్లు (సుమారు $35 మిలియన్లు) ఉంటుందని అంచనా. ఈ బంగారు బహుమతులు కేవలం బహుమతి మాత్రమే కాదని, ఉద్యోగుల పట్ల కృతజ్ఞత, గౌరవానికి చిహ్నం అని కంపెనీ వ్యవస్థాపకుడు పేర్కొన్నాడు. అందుకే ఈ చొరవ విస్తృతంగా ప్రశంసించబడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




