Venu Swamy: ‘అసలు సినిమా ముందుంది’.. మరోసారి అల్లు అర్జున్ జాతకం చెప్పిన వేణు స్వామి.. వీడియో
వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల విషయంలో తాను చేసిన కామెంట్స్ కు మహిళా కమిషన్ కు క్షమాపణలు చెప్పిన ఆయన ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఐటీ దాడులపై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో బాంబ్ పేల్చారు. గతంలో నాగచైతన్య, సమంత మొదలు ఇటీవల అల్లు అర్జున్ వరకు సెలబ్రిటీల జాతకం ఇదేనంటూ వార్తల్లో నిలిచారాయన. అయితే ఇటీవల శోభిత విషయంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ పై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమన్లు కూడా జారీ చేసింది. దీంతో వేణు స్వామి స్వయంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఎన్ని వివాదాలు అయినా వేణుస్వామి మాత్రం సెలబ్రిటీల జాతకాలు చెప్పడం మానట్లేదు. తాజాగా ఆయన మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ జాతకాల గురించి చెప్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఇలా చెప్పుకొచ్చారు.. ‘అల్లు అర్జున్ గురించి, ఆయన చుట్టూ జరిగే వాటి గురించి అందరూ వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ రైడ్స్ కు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు. అల్లు అర్జున్ ది కన్యారాశి, సుకుమార్ గారిది కుంభ రాశి. వీళ్ల జాతకాలు షష్టాష్టకం కాంబినేషన్. వీళ్ళ జాతకంలో శని స్థానం బట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ రెండు కలవడం వల్ల ఒక ఫైర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. దీని వల్ల చుట్టుపక్కన వాళ్లు కూడా ప్రభావితమవుతారు.
‘ అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఇప్పుడు ఉన్న శని స్థానం ప్రకారం ఆయనకు శత్రు స్థానం, రోగ స్థానం ఉన్నాయి. గత సంవత్సరం నుంచి అల్లు అర్జున్ మీద విపరీతమైన శత్రువుల దాడి జరుగుతుంది. ఈ కారణంగానే ఆయన జైలుకు వెళ్లారు. దీని వల్ల మానసికంగా కూడా బాగా దెబ్బ తిన్నారు. వీటితో పాటు ఓ సంచలనం సృష్టిస్తారు. అదే పుష్ప 2 సినిమా. 2025 మార్చ్ 30 వరకు అల్లు అర్జున్, సుకుమార్ లకు శని కీలక స్థానాల్లో ఉండటం వల్ల పెను సంచలనాలు, సమస్యలు వస్తాయి. వీరి వల్ల మైత్రి మూవీస్ వాళ్ళు, దేవిశ్రీ ప్రసాద్ ఎఫెక్ట్ అయ్యారు. మార్చ్ 30 తర్వాత ఇంకా పైకి ఎదుగుతారు’
‘ఉగాది నుంచి శని తులారాశిలోకి వెళ్లడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద, తెలుగు రాజకీయాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్స్, ట్రైలర్ మాత్రమే పడ్డాయి. అసలైన సినిమా ముందుంటుంది. ఇలాంటివి మార్చ్ 30 నుంచి మరిన్ని చూడబోతున్నాం’ అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వేణుస్వామి వీడియో మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
వేణు స్వామి వీడియో ఇదిగో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








