AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin: నితిన్‌ను కలిసిన యంగ్ హీరో.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక బహుమతి అందించిన ఆశిష్ రెడ్డి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుని కుమారుడు ఆశిష్‌ రెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రముఖ వ్యాపార వేత్త కూతురు ఆద్వితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. గతేడాది నవంబర్‌ లో వీరి ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌ గా జరిగింది

Nithiin: నితిన్‌ను కలిసిన యంగ్ హీరో.. పెళ్లికి రావాలంటూ ప్రత్యేక బహుమతి అందించిన ఆశిష్ రెడ్డి
Ashish Reddy Nithiin
Basha Shek
|

Updated on: Feb 11, 2024 | 6:36 PM

Share

టాలీవుడ్‌ యంగ్‌ హీరో, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుని కుమారుడు ఆశిష్‌ రెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రముఖ వ్యాపార వేత్త కూతురు ఆద్వితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. గతేడాది నవంబర్‌ లో వీరి ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌ గా జరిగింది. ఇక ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న ఆశిష్‌- ఆద్వితా రెడ్డిల వివాహం జరగనుంది. జైపూర్‌ వేదికగా జరిగే ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఆశిష్‌ రెడ్డి పెళ్లి కోసం సినీ, రాజకీయ ప్రముఖుల ఇంటికెళ్లి ఆహ్వానిస్తున్నారు దిల్‌ రాజు. పెళ్లికి రావాలంటూ ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, చిరంజీవి, మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌ , జూనియర్‌ ఎన్టీఆర్‌, రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జున, వెంకటేష్‌, మంచు మోహన్‌ బాబు తదితర ప్రముఖులకు పెళ్లి శుభలేఖలు అందించారు. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్‍ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతనికి ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా ఆశిష్‌ రెడ్డి రౌడీ బాయ్స్‌ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. దిల్‌ రాజు నిర్మించిన ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ లో మలయాళం బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటించింది. అయితే రౌడీ బాయ్స్‌ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆశిష్ రెడ్డి. ఇప్పుడు సెల్ఫీష్‌ అనే మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఇందులో లవ్‌ టుడే మూవీ ఫేమ్‌ ఇవానా హీరోయిన్‌ గా నటిస్తోంది. కసి విశాల్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత సెల్ఫీష్‌ సినిమాను రిలీజ్‌ కావొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నితిన్ తో ఆశిష్ రెడ్డి..

మహేశ్ బాబు దంపతులకు ఆహ్వానం..

రామ్ చరణ్ దంపతులకు..

సెల్ఫీష్ సినిమాలో ఆశిష్ రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోజుకు 4 గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా? మీ బాడీలో అద్భుతం చూస్తార
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!