AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Bigg Boss: తెలుగు బిగ్ బాస్ షో ఆగిపోతుందా..? కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు

రాను రాను ఎంటర్‌టైన్మెంట్‌ అర్థం మారిపోతోంది. మొత్తం ఫ్యామిలీకి గంపగుత్తాగా ఎంటర్‌టైన్మెంట్‌ ఇచ్చే బిగ్‌బాస్‌ షో శ్రుతి తప్పుతోందా? బిగ్‌ బాస్‌ షో బిగ్‌ బూతుగా మారుతోందా? బుల్లితెర బిగ్‌ బాస్‌ షోలో బూతుపురాణం ఇప్పుడు సర్వత్రా హల్‌చల్‌ చేస్తోంది. తొలినుంచి వివాదాలు మూటగట్టుకుంటోన్న బిగ్‌బాస్‌ షో ఇప్పుడు ఏపీ కోర్టుమెట్లెక్కింది.

Telugu Bigg Boss: తెలుగు బిగ్ బాస్ షో ఆగిపోతుందా..? కీలక కామెంట్స్ చేసిన ఏపీ హైకోర్టు
Bigg Boss Telugu
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2022 | 8:10 PM

Share

ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటంటూ బుల్లితెరనుంచి జాలువారుతోన్న అశ్లీలంపై సర్వత్రా చర్చ రచ్చ రచ్చగా మారింది. బిగ్‌ బాస్‌ బిగ్‌ బూతేనంటూ విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఆరోజు బిగ్‌బాస్‌ షో బిగ్‌ బూతుగా మారుతోందన్నందుకు పెద్దాయన నారాయణపై అంతా నోరుపారేసుకున్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు(AP High Court) మెట్లెక్కింది బిగ్‌ బాస్‌ బూతు కాంట్రవర్సీ. బిగ్‌ బాస్‌ షో వల్ల యువతరం పెడదోవపడుతోందంటూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jagadeeshwar Reddy) ఏపీ హైకోర్టులో బిగ్‌ బాస్‌కి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంచి ఇష్యూని రెయిజ్‌ చేశారంటూ పిల్‌ దాఖలు చేసిన కేతిరెడ్డిని ప్రశంసించిన కోర్టు, మన పిల్లలు బాగున్నారా లేదా అని పట్టించుకోకపోవడం భావ్యం కాదని అభిప్రాయపడింది. నిజానికి 2019లోనే బిగ్‌బాస్‌ షో 3 పై వివాదం చెలరేగింది. షో ప్రారంభానికి ముందునుంచే ఆరోపణలు హల్‌చల్‌ చేశాయి. బిగ్‌బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం దీనిపై విచారించనున్న ధర్మాసనం బిగ్‌బాస్ వంటి షోల వల్ల యువత పెడదారిపడుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి షోల వల్ల విపరీత పోకడలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది.  మొత్తానికి బిగ్‌బాస్‌ షో రాను రాను రచ్చరంబోలాగా తయారవడంతో దీనిపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందో సోమవారం తేలిపోనుంది.

కాగా ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ షో1 పైనా వివాదం చెలరేగింది. ఈ షో తెలుగు సంస్కృతిని కించపరుస్తోందంటూ బ్రాహ్మణ సంఘాలు విమర్శలు గుప్పించాయి. ఓ టాస్క్ లో భాగంగా హోమగుండం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే హోమగుండం వద్ద బ్రెష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకున్న వ్యవహారంపై ఆ రోజు అగ్గిరాజుకుంది. ఒకటి కాదు రెండు కాదు. ఆరంభం నుంచి బిగ్‌బాస్ షో రోజుకో కొత్త కాంట్రవర్సీని మోసుకొచ్చింది.

Also Read: Viral: మరీ ఇలా తయారేంట్రా బాబు.. మలద్వారంలో కూడానా..!