Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్..

సూపర్‌స్టార్‌ అంటే గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం ఇపుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. నటశేఖరుడి ప్రస్థానం ముగిసిందనే నిజాన్ని, ఆయన ఈలోకంలో లేరనే వార్తను ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం జగన్..
Cm Jagan, Krishna
Follow us

|

Updated on: Nov 16, 2022 | 8:40 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారు ఏపీ సీఎం జగన్‌. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చే జగన్‌.. అక్కడి నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకొని కృష్ణ పార్ధివదేహానికి నివాళి అర్పిస్తారు. హీరో మహేష్‌ బాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు సీఎం జగన్‌. సూపర్‌స్టార్‌ అంటే గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం ఇపుడు వెక్కివెక్కి ఏడుస్తోంది. నటశేఖరుడి ప్రస్థానం ముగిసిందనే నిజాన్ని, ఆయన ఈలోకంలో లేరనే వార్తను ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి చూపుల కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తున్నారు. నిన్నటి నుంచి ఆ అభిమన ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. తెలుగు లెజండరీ నటులు, సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి ప్రముఖులు సంతాపం తెలిపారు.

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృష్ణ ఇంటికివచ్చి కృష్ణకు నివాళ్ళర్పించారు. కృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించుకోనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు పద్మాలయ స్టూడియోస్‌ నుంచి అంత్యక్రియలు నిర్వహించే మహాప్రస్థానానికి తెలుగు సినీ తేజం సన్‌ ఆఫ్‌ ద సాయిల్‌ కృష్ణ అంతిమయాత్రకు సర్వం సిద్ధం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్ర్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినీ కెరటం కృష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ కృష్ణకు ఘననివాళ్ళర్పిస్తోంది. తమ కుటుంబ సభ్యుడికి సంతాపసూచకంగా ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ బంద్‌ పాటిస్తోంది. ఇక ఏపీలో మార్నింగ్‌ షోలు రద్దు చేస్తున్నట్టు సినీ నిర్మాతలు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.