Miss Shetty Mr Polishetty: తల్లికావాలంటే ప్రగ్నెంట్ అయితే చాలు.. పెళ్లేందుకు.? ఆకట్టుకుంటున్నట్రైలర్

ఈ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నయి. పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. యూట్యూబ్ లో ఇప్పటికీ ఈ మూవీ పాటలు మిలియన్ వ్యూస్ ను రాబడుతున్నాయి. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీని సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Miss Shetty Mr Polishetty: తల్లికావాలంటే ప్రగ్నెంట్ అయితే చాలు.. పెళ్లేందుకు.? ఆకట్టుకుంటున్నట్రైలర్
Miss Shetty .. Mr. Polishet
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 22, 2023 | 8:14 AM

స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆమె సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నయి. పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. యూట్యూబ్ లో ఇప్పటికీ ఈ మూవీ పాటలు మిలియన్ వ్యూస్ ను రాబడుతున్నాయి. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీని సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ మూవీ ప్రమోషన్స్ బాధ్యత హీరో నవీన్ పోలిశెట్టి తీసుకున్నారు . అనుష్క ఎక్కడా కనిపించకపోయినప్పటికీ.. నవీన్ బాగానే సందడి చేస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఫుల్ లెన్త్ ఫన్ ఫుల్ గా ఈ మూవీ ట్రైలర్ ఉంది. పెళ్ళికాకుండా తల్లి కావాలని ఆశపడే యువతిగా ఈ సినిమా అనుష్క కనిపించనుంది. తల్లి కావాలంటే ప్రగ్నెంట్ అయితే చాలు.. పెళ్లి అవసరం లేదు అంటూ వచ్చిన డైలాగ్ సినిమా పై ఓ క్లారిటీ తీసుకొచ్చింది.

తనకు కావాల్సిన పర్ఫెక్ట్ అబ్బాయి కోసం వెతికే క్రమంలో ఆమెకు నవీన్ కనిపించడంలాంటివి ఈ ట్రైలర్ లో చూపించారు.ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

మోస్ట్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నూతన దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. జాతిరత్నాల తర్వాత నవీన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్