AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ .. నటనకు నిలువెత్తు రూపం చిరంజీవి

సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించారు. చిన్న తనం నుంచి నటన పై ఆసక్తి  ఉండటంతో చదువు పూర్తి చేసుకొని 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరారు. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు చిరంజీవి.

Happy Birthday Chiranjeevi:  హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ .. నటనకు నిలువెత్తు రూపం చిరంజీవి
Megastar Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Aug 22, 2023 | 7:36 AM

Share

శివ శంకర వరప్రసాద్.. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ చిరంజీవి అంటే మాత్రం అందరి నోటా మెగాస్టార్ మెగాస్టార్ అనే నినాదం వస్తుంది. సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించారు. చిన్న తనం నుంచి నటన పై ఆసక్తి  ఉండటంతో చదువు పూర్తి చేసుకొని 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరారు. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా మారారు చిరంజీవి.. కానీ ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయ్యింది. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు అనే సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది.

ఇక హీరోగానే కాదు విలన్ గాను నటించారు చిరంజీవి. 1979లో వచ్చిన ఐ లవ్ యు అనే సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 1979 లో చిరంజీవి నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజ్ అయ్యాయి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు రాణిస్తున్న సమయంలోనూ చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక బ్రేక్ డాన్స్ ను మెగాస్టార్ చిరంజీవి పెట్టింది పేరు. ఆయన స్టెప్పులకు ఊగని ప్రేక్షకులు ఉండరు. యాక్షన్ హీరోగానే కాదు జాధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలో హాస్యప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేవలం హీరోగానే కావు కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లోనూ నటించారు. 2001 లో వచ్చిన శ్రీమంజునాథ సినిమాలో శివుడిగా కనిపించరు. అలాగే 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో శివుడిగా కనిపించరు. ఇక కొంతకాలం రాజకీయాల్లోకి వెళ్లి ఆ తర్వాత తిరిగి 2013లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్. రీసెంట్ గా చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.