AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: మరో ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న కార్తికేయ 2.. రిలీజ్ ఎప్పుడంటే

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ యంగ్ హీరో నుంచి రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

Karthikeya 2: మరో ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న కార్తికేయ 2.. రిలీజ్ ఎప్పుడంటే
Karthikeya 2
Rajeev Rayala
|

Updated on: Aug 02, 2022 | 7:26 PM

Share

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddhartha)ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ఈ యంగ్ హీరో నుంచి రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో కార్తికేయ 2 ఒకటి 18 పేజెస్ సినిమా మరొకటి. ఇక వీటిలో చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2(Karthikeya 2)పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన కార్తికేయ ట్రైలర్ 1 పై అద్భుతమైన స్పందన వచ్చింది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆగష్టు 6న కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రైలర్ 1తో ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉండనుందని తెలుస్తోంది. ఇక కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. టెక్నీషియన్స్‌తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.. మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.  శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి