AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Eligible Bachelor : ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీమ్.. సినిమా నుంచి మరో పాట..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్

Most Eligible Bachelor : ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీమ్.. సినిమా నుంచి మరో పాట..
Akhil
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 12, 2021 | 6:16 AM

Share

Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాను నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేక పోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఉన్నాయి. అటు అఖిల్‌, ఇటు భాస్కర్ కెరీర్‌కు కీల‌కంగా మార‌డంతో సినిమాకు ఎక్కడ‌లేని ప్రాధాన్యత వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు విడుదలైన ‘మనసా మనసా’ ‘గుచ్చే గులాబీ’ ‘ఏ జిందగీ’ ‘లెహరాయి’ పాటలు శ్రోతలను ఆకట్టుకొని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమానుంచి మరో పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. ”చిట్టి అడుగు” అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని  రిలీజ్ చేశారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. యువ గాయకుడు జియా ఉల్ హక్ ఈ పాటను ఆలపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..