Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్..
Anasuya: మా అధ్యక్ష ఎన్నికలు ముగిసి ఫలితం వచ్చిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. మా అధ్యక్ష పీటాన్ని మంచు విష్ణు అదిరోహించిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణు...
Anasuya: మా అధ్యక్ష ఎన్నికలు ముగిసి ఫలితం వచ్చిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. మా అధ్యక్ష పీటాన్ని మంచు విష్ణు అదిరోహించిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణు చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం విధితమే. చిరంజీవి తనను పోటీ నుంచి తప్పుకోమన్నాడని, రామ్ చరణ్ తనకు కాకుండా ప్రకాశ్ రాజ్‌కు ఓటు వేశాడని ఇలా ఎన్నో సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ సంచలనాలు ఇక్కడితోనే ఆగిపోలేదు. తాజాగా యాంకర్, నటి అనసూయ కూడా స్పందించారు.
ఆదివారం అనసూయను గెలిచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి సోమవారం ఓడిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించి అనసూయ ట్విట్టర్ వేదికగా పలు వరుస ట్వీట్‌లు చేశారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘క్షమించండి ఒక విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది. మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దు. నిన్న ‘అత్యధిక మెజారిటీ’, ‘భారీ మెజారిటీ’తో గెలుపు అని, ఈ రోజు ‘లాస్ట్’, ‘ఓటమి’ అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరుగుగుంటుదబ్బా’ అంటూ ట్వీట్ చేసింది.
ఇక మరో ట్వీట్‌లో.. ‘అంటే నిన్న ఎవరో ఎలక్షన్స్ రూల్స్‌కు భిన్నంగా బ్యాలెట్ పేపర్స్‌ని ఇంటికి కూడా తీసుకెళ్లారంటా.. అంటే బయట టాకూ.. నేనట్లేదు’ అంటూ రాసుకొచ్చింది. అంతటితో ఆగని అనసూయ.. ‘అసలూ ఉన్న సుమారు 900 ఓటర్స్‌లో సుమారు 600 చిల్లర ఓటర్స్ లెక్కింపునకు రెండో రోజుకి వాయిదా వేయాల్సిన సమయం ఎందుకు పట్టిందంటారు.? అహా ఏదో అర్థం కాక అడుగుతున్నాను’ అంటూ పలు సంచలన ట్వీట్ చేసింది.
అనసూయ చేసిన ట్వీట్‌లు..
Ante mari ninna yevaro election rules ki bhinnanga ballot papers ni intiki kuda teeskellarani .. aha ante bayata talku.. ? nenatledu https://t.co/tAM8MVVhxV
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
Asalu unna sumaru 900 voters lo sumaru 600 chillara voters lekkimpuki rendo roju ki vaayida veyalsinanta time eduku pattindantaru?? Aha edu ardhamkaka adugutunnanu.. ??
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
Also Read: Huzurabad By Election: హుజురాబాద్ పొలిటికల్ లీగ్‌లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్
MAA Elections 2021: ‘మా’ యుద్ధం ముగిసినా చల్లారని వేడి.. వరుస రాజీనామాలతో కొనసాగుతున్న ప్రకంపనలు