AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

మా సభ్యత్వానికి నటుడు, మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా పత్రాన్ని ఆయన ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు...

Nagababu: 'మా' రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..
Nagababu
Srinivas Chekkilla
|

Updated on: Oct 11, 2021 | 9:53 PM

Share

మా సభ్యత్వానికి నటుడు, మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా పత్రాన్ని ఆయన ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. ఎన్నికల హడావిడి మొదలైన దగ్గర నుంచి నాగబాబు ప్రకాష్ రాజ్‎కు సపోర్ట్ చేస్తూ వచ్చారు.. అతడు జాతీయస్థాయి నటుడు అంటూ.. కింది నుంచి పైకి వచ్చాడు అంటూ ప్రకాష్ రాజ్‎పై ప్రశంసలు కురిపించారు నాగబాబు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగబాబు మా కు రాజీనామా చేస్తున్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్లో “నా” ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు. – నాగబాబు’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు. అలాగే నేడు సాయంత్రం 7 గంటలకు సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వస్తానని ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడ తనని అడగాలని కోరారు నాగబాబు. మరి అభిమానులు, ప్రేక్షకుల అడిగే ప్రశ్నలకు నాగబాబు ఎలాంటి సమాదానాలు చెప్తారో చూడాలి.

ప్రకాష్ రాజ్ కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను తెలుగువాడిని కాదని.. అతిథిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తాను అసోసియేషన్ నుంచి బయటికి వచ్చానని. నటించవద్దని ఎలాంటి రూల్స్ కాబట్టి.. యథావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని వివరించారు. తనను నాన్ లోకల్ అన్నారని.. అతిథిగానే ఉంటే గౌరవిస్తామన్నారు.

Read Also… Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..