Actor Ileana Dcruz : జీరో మేకప్ లుక్‌లో అదరగొడుతున్న గోవా బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్ వైరల్..
Actor Ileana Dcruz : సమ్మర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతను మరింత పెంచడానికి హీరోయిన్ ఇలియానా డిక్రజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పిక్‌ను పోస్ట్ చేసింది. బర్ఫీ నటి ఈ వేసవిలో "సన్ బేబీ" గా
Actor Ileana Dcruz : సమ్మర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతను మరింత పెంచడానికి హీరోయిన్ ఇలియానా డిక్రజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పిక్‌ను పోస్ట్ చేసింది. బర్ఫీ నటి ఈ వేసవిలో “సన్ బేబీ” గా మారింది. తాజాగా జీరో మేకప్‌లో సూర్యుడిని చూస్తూ సెల్పీ దిగింది ఈ అమ్మడు. ఈ పిక్‌లో ఆమె మొహం చంద్రబింబం వలే మెరిసిపోతుంది. ఫేస్‌పై ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంది. దీంతో ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇలియానా ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలను పరిశీలిస్తే ఎండలో ఉన్నవే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఆమె ఎండలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతుందని తెలుస్తోంది.
ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటిస్తున్న ది బిగ్ బుల్ సినిమాలో నటిస్తోంది. ఇందులో అభిషేక్ బచ్చన్ హర్షద్ మెహతా పాత్రలోనటిస్తున్నారు. కూకీ గులాటి దర్శకత్వంలో సుమిత్ వాట్స్, నికితా దత్తా, సోహుమ్ షా, లేఖా ప్రజాపతి, రామ్ కపూర్ ప్రధాన పాత్రలను పోషించారు. ఇందులో ఇలియానా జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ పురుషుల ప్రపంచంలో ఓ మహిళ ప్రదర్శన లాగా ఉంటుందని తెలిపింది. ఈ సినిమా తర్వాత ఆమె రణదీప్ హుడా హీరోగా నటిస్తున్న అన్ఫెయిర్ & లవ్లీ సినిమా చేయనుంది.
దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఇలియానా. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా దూసుకు పోయింది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఈ గోవా బ్యూటీ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత ఆమె బరువు పెరగడం, ప్రేమ విఫలం అవ్వడం ఇలా వరుసగా జరిగిపోయాయి. దీంతో డిప్రషన్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత కోలుకొని పాత ఇలియానాలా మారింది.