Anirudh Ravichander: సినిమాలకే హైలైట్‌గా నిలుస్తున్న అనిరుద్ మ్యూజిక్..
సూపర్‌స్టార్స్, యంగ్‌స్టర్స్ అనే తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్టులన్నిటికీ నేనే మ్యూజిక్ అంటున్నారు ఈ యంగ్‌స్టర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుమ్మేయాలి. సౌండ్‌తో స్క్రీన్లు చినిగిపోవాలంటే నిన్నమొన్నటిదాకా మన ముందున్న మ్యూజికల్ ఆప్షన్ పేరు తమన్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ తమన్ స్కోర్ అమాంతం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ మాటను బీట్ చేయడానికి నేనున్నా.. స్కోర్ షేరింగ్‌కి సిద్ధంగా ఉండండి అనే వాయిస్ వినిపిస్తోంది అనిరుద్ నుంచి. వా... నువ్ కావాలయ్యా అని స్క్రీన్ మీద అన్నది తమన్నానే అయినా.. మేకర్స్ మాత్రం అనిరుద్ వైపు చూస్తున్నారు.
సినిమా హిట్ కావడానికి ఎన్ని రకాల అవకాశాలుంటాయో అన్నిటిని గురించి ఆరా తీస్తారు అభిమానులు. ఇప్పుడు సినిమాకు మిడాస్ టచ్ ఇచ్చే మ్యూజిక్ డైరక్టర్‌గా ట్రెమండస్ సక్సెస్ రేషియో దూసుకుపోతున్నారు అనిరుద్. సూపర్‌స్టార్స్, యంగ్‌స్టర్స్ అనే తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్టులన్నిటికీ నేనే మ్యూజిక్ అంటున్నారు ఈ యంగ్‌స్టర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుమ్మేయాలి. సౌండ్‌తో స్క్రీన్లు చినిగిపోవాలంటే నిన్నమొన్నటిదాకా మన ముందున్న మ్యూజికల్ ఆప్షన్ పేరు తమన్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ తమన్ స్కోర్ అమాంతం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ మాటను బీట్ చేయడానికి నేనున్నా.. స్కోర్ షేరింగ్‌కి సిద్ధంగా ఉండండి అనే వాయిస్ వినిపిస్తోంది అనిరుద్ నుంచి. వా… నువ్ కావాలయ్యా అని స్క్రీన్ మీద అన్నది తమన్నానే అయినా.. మేకర్స్ మాత్రం అనిరుద్ వైపు చూస్తున్నారు.
View this post on Instagram
జైలర్‌తో ఆల్రెడీ తమిళనాడుని కమ్మేసిన అనిరుద్ నెక్స్ట మంత్ జవాన్‌తో షారుఖ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ లో షారుఖ్ యంగ్‌గా కనిపిస్తున్నారనే మాట ఎంతగా వైరల్ అవుతోందో, సాంగ్స్ కూడా అంత ఎనర్జిటిక్‌గా ఉన్నాయనే మాటలు కూడా అంతే గట్టిగా వినిపిస్తున్నాయి. తమిళ్, హిందీలో మాత్రమే కాదు, తెలుగులోనూ జోరు పెంచుతున్నారు అనిరుద్. ఒక రకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒత్తిడి మేరకే దేవరలో అనిరుద్‌కి ఛాన్స్ ఇచ్చారు కొరటాల శివ. దేవర ట్యూన్స్ మాత్రమే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కూడా బెస్ట్ స్కోప్ ఉండటంతో ఇలా ఫిక్సయ్యారు.
View this post on Instagram
అటు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా అనిరుద్ ఇచ్చే ట్యూన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఖుషి ఆల్బమ్‌ని మించి నెక్స్ట్ అనిరుద్ బీట్స్ ఉండాలని రిక్వెస్టులు పెడుతున్నారు. టాలీవుడ్‌లో బజ్ ఇలా ఉంటే, తమిళ తంబిల ఫోకస్ మాత్రం నెక్స్ట్ లియో మీద ఉంది. ఆల్రెడీ తలైవర్ సినిమాకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇరగదీసిన అనిరుద్ లియోని బ్లడీ స్వీట్‌గా ఇలా డిజైన్ చేశారో వినాలని ఉవ్విళ్లూరుతున్నారు. అక్టోబర్ 19 కోసం ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. తాను సైన్ చేసిన ప్రతి సినిమాకూ బీట్స్ ప్లస్ బ్యాక్‌గ్రౌండ్‌తో అదిరిపోయే మ్యూజిక్ ఇస్తూ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోయారు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి