Vaarasudu: విజయ్ వారసుడుకు మరో షాక్.. నోటీసులు జారీ చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. ఏమైందంటే

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Vaarasudu: విజయ్ వారసుడుకు మరో షాక్.. నోటీసులు జారీ చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. ఏమైందంటే
Varisu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2022 | 8:26 PM

తమిళ్ స్టార్ హీరోలో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారసుడు. ఈ సినిమా తమిళ్ లో వారీసు అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.ఈ సినిమాకు 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందట. ఈ సినిమాను వంశీ తన స్టైల్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కికిస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ సినిమానా లేక తెలుగు సినిమానా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ విషయం పై ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందిస్తూ ఈ సినిమా తమిళ్ సినిమా అని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. అయితే సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ప్రధాన్యత ఇవ్వకూడదని నిర్మాతల మండలి కూడా ప్రకటించడంతో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఈ సినిమాలో అనుమతి లేకుండా ఏనుగులను ఉపయోగించారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ మేరకు నిర్మాత దిల్ రాజుకు నోటీసులు పంపించారు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగులకు రక్షణ కల్పిస్తూ చట్టం ఉంది. దీని ప్రకారమే వారీసు చిత్ర నిర్మాత దిల్ రాజుకు నోటీసులు పంపించారు, దీని పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
Varasudu

Varasudu

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే