Richa Chadda: ట్వీట్‌ చేయనేలా, క్షమాపణలు చెప్పనేలా.? ఇండియన్‌ ఆర్మీపై బాలీవుడ్‌ బ్యూటీ అనుచిత వ్యాఖ్యలు..

కొందరు సెలబ్రిటీలు ఏదో ఒక వివాదంతో సావాసం చేస్తుంటారు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ వారు చేసిన పనులు పెద్ద దుమారానికి కారణమవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైంది...

Richa Chadda: ట్వీట్‌ చేయనేలా, క్షమాపణలు చెప్పనేలా.? ఇండియన్‌ ఆర్మీపై బాలీవుడ్‌ బ్యూటీ అనుచిత వ్యాఖ్యలు..
Richa Chadda
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2022 | 8:42 PM

కొందరు సెలబ్రిటీలు ఏదో ఒక వివాదంతో సావాసం చేస్తుంటారు. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ వారు చేసిన పనులు పెద్ద దుమారానికి కారణమవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైంది. చివరికి క్షమాపణలు చెప్పి, చేసిన ట్వీట్‌ను తొలగించింది. భారత సైన్యాన్ని ఉద్దేశించి రిచా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీసింది. నెటిజన్ల నుంచి రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే క్షమాపణలు చెప్పింది. ఇంతకీ రిచా ఏమని ట్వీట్‌ చేసిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా.. కోరి కోరి వివాదాన్ని కొనితెచ్చుకుంది. ఇండియన్ ఆర్మీపై ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్మీని చుల‌క‌న చేసేలా రిచా ట్వీట్‌ ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. POK ను స్వాధీనం చేసుకుంటామని భారత ఆర్మీ నార్తన్‌ కమాండ్‌ కొద్దిరోజుల క్రితం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తున్నామని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ప్రకటనను చులకన చేసేలా రిచా ట్వీట్ చేసింది.  POK పై దాడి చేస్తే మరో గాల్వాన్‌ అనుభవం ఎదురవుతుందని ఆమె నార్తన్‌ కమాండ్‌ స్టేట్‌మెంట్‌ను గేలి చేసే విధంగా ట్వీట్‌ చేసింది. దీనిపై ఆర్మీ అధికారులు , బీజేపీ నేతల తీవ్రంగా మండిపడ్డారు. సైన్యాన్ని అవమానించడం కొందరు సెల్రబ్రిటీలకు అలవాటుగా మారిందన్నారు బీజేపీ సీనియర్‌ నేత నలిన్‌ కోహ్లీ. పబ్లిసిటీ కోసం వాళ్లు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని , భారత సైన్యం సత్తాను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. రిచా చద్దాపై చర్యలు తీసుకోవాలని శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే డిమాండ్ చేశారు. మరోవైపు నటి ట్వీట్‌పై ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. తన కామెంట్స్‌కు రిచా చడ్డా క్షమాపణలు చెప్పారు. భారత సైన్యాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ట్వీట్‌ను డిలీట్ చేయ‌ట‌మే కాకుండా త‌న త‌ప్పుకు క్షమించాలంటూ ట్వీట్ కూడా చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..