RBI: ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతున్న రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆర్‌బీఐ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి.

కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు పతనమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగవుతున్నాయి. కరోనా ఆంక్షలు దాదాపు ఎత్తివేయడంతో మళ్లీ ఆర్థిక కార్యలాపాలు పుంజుకున్నాయి. దీంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ముందు..

RBI: ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతున్న రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆర్‌బీఐ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి.
AP And TS GSDP growth
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2022 | 5:52 PM

కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు పతనమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగవుతున్నాయి. కరోనా ఆంక్షలు దాదాపు ఎత్తివేయడంతో మళ్లీ ఆర్థిక కార్యలాపాలు పుంజుకున్నాయి. దీంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కరోనా ముందు పరిస్థితులకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గణంకాలను ప్రచురించాయి. ఆర్‌బీఐ ఇటీవల హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ స్టాటిటిక్స్‌ పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితా ప్రకారం ఆర్థికాభివృద్ధి శరవేగంగా దూసుకుపోతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతం ఉండడం విశేషం. ఇక తెలంగాణ వృద్ధిరేటు కూడా దూసుకుపోతోంది. 10.9 శాతంతో తెలంగాణ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. 11 శాతంతో రాజస్థాన్‌ రెండో స్థానంలో నిలవగా, తర్వాత బిహార్‌, ఢిల్లీ రాష్ట్రాలు నిలిచాయి. ఇక చివరి 5 రాష్ట్రాల్లో జమ్ము కశ్మీర్‌ (7.9 శాతం), కేరళ (7.1 శాతం), పంజాబ్‌ (6.9 శాతం), ఉత్తరాఖండ్‌ (6.1 శాతం), ఉత్తర ప్రదేశ్‌ (4.2 శాతం) ఉన్నాయి.

Rbi

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే 2022 ఏడాదికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ఏకంగా 88 శాతం పెరగడం విశేషం. ఈ జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత 79 శాతం బడ్జెట్‌తో వెస్ట్ బెంగాల్‌ రెండో స్థానంలో ఉండగా తర్వాత వరుసగా.. ఒడిశా (67 శాతం), పంజాబ్‌ (64 శాతం), ఉత్తర ప్రదేశ్‌ (53 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు విధించిన రాష్ట్రాల్లో 3 శాతంతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా తర్వాత వరుసగా హర్యానా (-1 శాతం), హిమచాల్ ప్రదేశ్‌ (-2), జమ్ము కశ్మీర్‌ (-3), బిహార్‌ (-10) రాష్ట్రాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..