AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుండు తెచ్చిన తంటా ఉద్యోగం మీదికొచ్చింది.. పాపం సార్ గారి జాబ్ పోయింది

దేవుడి మొక్కు తీర్చుకునేందుకు గుండు కొట్టించుకున్నాడు. ఇలా చేస్తే ఎక్కడైనా కష్టాలు పోవాలి.. కానీ ఆయనకు లేనిపోని కష్టాలు ఎదురయ్యాయి. ఏకంగా ఉద్యోగానికే ఎసరు వచ్చింది.

Andhra Pradesh: గుండు తెచ్చిన తంటా ఉద్యోగం మీదికొచ్చింది.. పాపం సార్ గారి జాబ్ పోయింది
Suspended Teacher Adinarayana
Ram Naramaneni
|

Updated on: Nov 24, 2022 | 5:04 PM

Share

గుండు తెచ్చిన తంటా ఉద్యోగం మీదికొచ్చింది. సమస్యలు తీర్చాలని దేవుడి గుడికెళ్లి గుండు గీయించుకొని మొక్కు చెల్లించుకున్న ఫలితానికి తన ఉద్యోగానికే ఎసరు వచ్చింది. ఏకంగా జాబ్ నుంచి సస్పెండైన సదరు ప్రభుత్వ టీచర్.. తన జీవనాధారాన్ని పోగొట్టుకున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందా పదండి.

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మేలాపురం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆదినారాయణ అనే టీచర్ గత నెల 5న కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని మొక్కులు తీర్చుకున్నా. ఆ తర్వాత యధావిధిగా తన విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేషియల్ యాప్ లో హాజరు వేయబోయారు. అయితే  సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటో ఒకేలా లేకపోవడంతో.. ఆ యాప్ ఈ మొహం నీది కాదంటూ రిజెక్ట్ చేసింది. దీనిపై టీచర్ ఆదినారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారాయన. అప్పట్లో ఈ సంఘటనపై మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. ప్రభుత్వంపై నెగిటివ్ కామెంట్స్ చేశారు.

ఇష్యూపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. టీచర్ ఆదినారాయణకు ఈ నెల 17న మెమో జారీచేశారు. దీనికి  ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు.  ఆ వివరాలను పత్రికలకు తాము లీక్ చేయలేదని భంగపడ్డారు. అయినా ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.   ఉన్నతాధికారులతో చెప్పి సమస్యను పరిష్కరించుకోవాల్సిన టీచర్.. మీడియాకు చెప్పడం ఏంటంటూ అధికారులు సీరియస్ అయ్యారు. లేటెస్ట్‌గా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీఈవో మీనాక్షి. యాప్‌లోని లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..