Anil Ravipudi : ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేష్ డైరెక్టర్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు.కొరటాల, రాజమౌళి,శంకర్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ స్ట్రీక్‌లో ఉన్నాడు ఈ కుర్రాడైరెక్టర్.
Anil Ravipudi : తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు.కొరటాల, రాజమౌళి,శంకర్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ స్ట్రీక్‌లో ఉన్నాడు ఈ కుర్రాడైరెక్టర్. ఒకటి రెండు కాదు వరుసగా ఐదు విజయాలు అందుకున్నాడు. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లు ఈయన దూసుకుపోతున్నాడు. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు కూడా మంచి విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘గాలి సంపత్’, ‘ఎఫ్3’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘గాలి సంపత్’కు సమర్పకుడిగా ఉన్న అనిల్.. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్3’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ‘గాలి సంతప్’ విడుదలకు సిద్ధమైంది. శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్, అచ్చు ప్రధాన పాత్రలలో అనీష్ తెరకెక్కించిన ఈ చిత్రం సరికొత్త కథతో డ్రామాగా రూపొందింది. లవ్‌లీ సింగ్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తుంది. అన్నికార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ ఖరీదైన వీళ్ళను కొనుగోలు చేసాడు. హైదరాబాద్ శివార్లలో 12 కోట్లు పెట్టి ఓ విల్లాను కొనుగోలు చేశాడని సమాచారం. అతి త్వరలోనే ఈ ఇంట్లోకు అడుగుపెట్టనున్నాడట.
మరిన్ని ఇక్కడ చదవండి :