ఒక్క సినిమాతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్న యష్.. సోషల్ మీడియాలో భారీగా పెరిగిన ఫాలోవర్స్ ..

కన్నడ స్టార్ హీరోరాకింగ్ స్టార్ యష్ మరోసారి ఇండియన్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు.కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ హీరో నెక్స్ట్ కూడా అదే

ఒక్క సినిమాతో అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకున్న యష్.. సోషల్ మీడియాలో భారీగా పెరిగిన ఫాలోవర్స్ ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 07, 2021 | 4:04 PM

KGF STAR YASH : కన్నడ స్టార్ హీరోరాకింగ్ స్టార్ యష్ మరోసారి ఇండియన్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు.కేజీఎఫ్ ఛాప్టర్ 1 తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ హీరో నెక్స్ట్ కూడా అదే స్టైల్ లో హిట్టందుకోవడానికి సిద్దమవుతున్నాడు. కేజీఎఫ్ 2 ప్రస్తుతం చివరిదశలో ఉంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడ రాకింగ్ స్టార్‌గా అభిమానులు పిలుచుకునే యష్.. కర్ణాటకలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేజీఎఫ్ సినిమాతో అన్నిభాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు.

తాజాగా యష్ ఇంస్టాగ్రామ్ ఫాలోయింగ్ 5 మిలియన్ కు చేరుకుంది. యష్ యాక్టింగ్ కు, బాడీలాంగ్వేజ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ స్టార్ హీరో సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా విషయాలతోపాటు. వ్యక్తిగత విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు. తన కుటుంబంతో గడిపే మధురమైన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్ర‌మంలో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగింది. క‌న్న‌డ నాట ఏ హీరో కూడా ఈ రికార్డ్ సాధించక‌పోవ‌డంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Taapsee Pannu: తాప్సీని మరోసారి టార్గెట్‌ చేసిన కంగనా రనౌత్‌… నిప్పు ఉప్పు మధ్యలో ఆ పప్పు ఎవరు..?

Priyanka Chopra : న్యూయార్క్‌లో రెస్టారెంట్ ఓనరైన బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోటల్ ఫొటోలు..