Priyanka Chopra : న్యూయార్క్‌లో రెస్టారెంట్ ఓనరైన బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోటల్ ఫొటోలు..

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో ఇండియన్ రెస్టారెంట్‌కి ఓనర్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో

Priyanka Chopra : న్యూయార్క్‌లో రెస్టారెంట్ ఓనరైన బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోటల్ ఫొటోలు..
Follow us
uppula Raju

|

Updated on: Mar 07, 2021 | 3:10 PM

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో ఇండియన్ రెస్టారెంట్‌కి ఓనర్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ఇప్పుడు అవి వైరల్‌గా మారుతున్నాయి. బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా క్వాంటికో అనే సీరియ‌ల్‌తో హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సీరియ‌ల్ త‌ర్వాత ప‌లు హాలీవుడ్ సినిమాలు చేసిన ప్రియాంక పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయింది.

ఈ మ‌ధ్య బాంద్రాలోని త‌న ఫ్లాట్ కూడా అమ్మేయ‌గా, దానిని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సిటాడెల్ అనే షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా త‌ను రెస్టారెంట్ ఓన‌ర్ అయిన‌ట్టు ప్రక‌టించింది. ఇండియ‌న్ ఫుడ్ అందించాల‌నే ఉద్ధేశంతో తాను సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన‌ట్టు ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. అంతేకాదు పూజా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. సోనాను చూపించ‌డాన్ని థ్రిల్‌గా ఫీల‌వుతున్నాను.

కొత్త రెస్టారెంట్‌లో ప్రేమ‌తో కూడిన ఇండియ‌న్ ఆహారం అందించాలి అని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుండి నేను తిన్న ఫుడ్, అద్భుతమైన వంటకాలు మంచి చెఫ్ చేతుల మీదుగా రెడీ అవుతున్నాయి. నా దేశ రుచుల‌ను ఈ రెస్టారెంట్‌లో చూస్తారు. ఏప్రిల్‌లో దీని ఓపెనింగ్ ఉంటుంది. మనీశ్ గోయెల్, డేవిడ్ ర్యాబిన్ లీడర్ షిప్ తోనే ఇదంతా సాధ్యమైంది. డిజైనర్ మెలిస్సా బోయర్స్ కు థ్యాంక్స్. అంటూ పోస్ట్ పెట్టింది ప్రియాంక‌. ఇటీవ‌ల అన్‌ఫినిషిడ్ బుక్‌ని రిలీజ్ చేసిన ప్రియాంక ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

Harmanpreet Kaur: క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసిన హర్మన్​ప్రీత్.. అప్రతిహాతంగా 100 వన్డేల ప్రస్థానం

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!