Hero Muttamsetty Viran : మెగాస్టార్ ఫ్యామిలీనుంచి టాలీవుడ్ కు మరో యంగ్ హీరో.. త్వరలో ప్రేక్షకుల ముందుకు..
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. అలా వచ్చిన ప్రతి హీరో తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నారు.
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. అలా వచ్చిన ప్రతి హీరో తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నారు. మెగాస్టార్ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు నటుడిగా, నిర్మాతగా ఉన్నారు. ఇక రెండో సోదరుడు పవన్ కళ్యాణ్ ఏకంగా పవర్ స్టార్ గా మారిపోయి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అలాగే చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు. ఆయన కుమారుడు అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టైలిష్ స్టార్ గా మారి టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. బన్నీ సోదరుడు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ కుమారుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లో అడుగు మోపారు. ఇప్పుడు మెగాపవర్ స్టార్ గా అభిమానులచేత నీరాజనాలు అందుకుంటున్నాడు చరణ్. అలాగే మెగాస్టార్ మేనల్లుడు సాయి దారం తేజ్ కూడా హీరోగా బాగానే రాణిస్తున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో సంచలనం సృష్టించాడు. ఇప్పడు మరో హీరో మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బావమరిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ . ‘బతుకు బస్టాండ్’ అనే సినిమాతో విరాన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగే ఈ సినిమానుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :