Priyanka Arul Mohan : అదిరిపోయే ఆఫర్ అందుకున్న నాని హీరోయిన్.. ఏకంగా సూపర్ స్టార్ సరసన…
ప్రియాంక అరుళ్ మోహన్.. ఇప్పుడు ఈ అమ్మడి ఫోటోలకు కుర్రాలంతా గూగుల్ ని గాలించేస్తున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముడుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్
Priyanka Arul Mohan : ప్రియాంక అరుళ్ మోహన్.. ఇప్పుడు ఈ అమ్మడి ఫోటోలకు కుర్రాలంతా గూగుల్ ని గాలించేస్తున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ ముడుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రియాంక ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ చిన్నది. ఆతర్వాత తాజాగా శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా మెరిసింది. ఇక ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండదేమో.. గ్యాంగ్ లీడర్ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ శ్రీకారం సినిమాలో కాస్త గ్లామరస్ గానే కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులోను ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో ప్రియాంక అరుళ్ మోహన్ ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిందంట ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనూ.. అటు ఫిలింనగర్ లోను జోరుగా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారిపాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాను తెరక్కించిన అనీల్ రావిపూడి మరో సారి మహేష్ ను డైరెక్ట్ చేయాలనీ చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రియాంక తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :