AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saranga Dariya Song : ఇంతకీ సారంగదరియా పాట వివాదంలో ట్విస్ట్.. సేకరించింది ఎవరు? సింగింగ్‌ క్రిడెట్ ఎవరికి?

Sanjay Kasula

|

Updated on: Mar 07, 2021 | 2:16 PM

Saranga Dariya Song: సారంగదరియా.. ఈ పాట ఇప్పుడు.. లోకల్ టు గ్లోబల్ ఇప్పుడు దుమ్మురేపుతోంది. జానపదానికి సుద్దాల అశోక్ తేజ మేకప్ అద్దితే మంగ్లీచే పాడించి..

Saranga Dariya Song Controversy: సారంగదరియా.. ఈ పాట ఇప్పుడు.. లోకల్ టు గ్లోబల్ ఇప్పుడు దుమ్మురేపుతోంది. జానపదానికి సుద్దాల అశోక్ తేజ మేకప్ అద్దితే మంగ్లీచే పాడించి.. లవ్‌ స్టోరీ సినిమా కోసం రంగులు అద్దారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇదే సారంగదరియా కాంట్రవర్సికి కేరాఫ్‌గా మారింది. ఎంత హిట్ అయ్యిందో.. అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. దీన్ని సేకరించింది ఎవరు? సింగింగ్‌ క్రిడెట్ ఎవరికి దక్కాలన్నదే ఇప్పుడు వివాదం.

రేలారే రేలా ఫేమ్ కోమలి.. తన అమ్మమ్మ దగ్గర సేకరించి.. జానపదం ఊపును జనానికి అందించింది. ప్రోగ్రామ్‌ గెస్ట్‌లు అప్పట్లో ఆహా ఓహో అన్నారు. అదే వేదికపై శిరిష సైతం.. తన పాటతో అదరగొట్టారు.

లవ్‌ స్టోరీ సినిమా కోసం ఈ పాట తీసుకున్న డైరెక్టర్‌.. సేకరణ క్రెడిట్‌ను సుద్దాల అశోక్‌ తేజకు ఇచ్చారు. ఆ క్రెడిట్ దక్కాల్సింది తనకు కదా అని ప్రశ్నిస్తోంది కోమలి.

ఆ పాటకు పెద్ద ఎత్తున జనాదరణ వచ్చేలా తాను బాధ్యత తీసుకుంటానని అప్పట్లో అశోక్ తేజ హామీ ఇచ్చినట్లు కోమలి గుర్తు చేస్తోంది. అసలు ఆ పాట తొలిసారి పాడింది తాను అంటోంది శిరిష.

సేకరణ, గానం క్రిడెట్ తమకు దక్కాలన్నది కోమలి, శిరిషల ఆవేదన. ఇప్పుడు కాకపోయినా.. మరోసారైన తమకు ఆ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఈ జానపద కళాకారులు. అయితే సినిమా యూనిట్ స్పందన ఏంటన్నది ఇప్పుడు “పెద్ద హిట్టుకొట్టేలా ..” ఉన్న క్వశ్చన్‌ మార్క్‌గా మిగిలింది.

ఇవి కూడా చదవండి..

Araku Bus Accident: అరకు బస్‌ ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు.. తీగలాగితే దిమ్మతిరిగే వాస్తవాలు..

వాస్తు శాస్త్రం: తులసి మొక్కను ఏ దిశలో నాటాలో తెలుసా.. బాల్కానీలో ఆ దిశలో పెడితే ఈ సమస్యలను తప్పవు..

Richards Birthday Special: విధ్వంసకరమైన ఆటకు తొలి ప్రతీక వివియన్‌ రిచర్డ్స్‌, రిచర్డ్స్‌ అంటేనే ఊచకోత..