Rajeev Rayala |
Updated on: Mar 07, 2021 | 2:02 PM
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ అందరికి పరిచయమే.. ధడక్ సినిమాతో ఈ అమ్మడు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆతర్వాత నటనకు ప్రాధాన్యత కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ పోతుంది ఈ బ్యూటీ. జాన్వి ప్రస్తుతం మైదాన్ సినిమా షూటింగ్‌లో బిజీగా గడిపేస్తుంది.
ఈ అమ్మడు అందంతోనే కాదు అభినయంతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో జాన్వీ పోస్ట్ చేసిన ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఇక త్వరలోనే మంచి సబ్జెక్ట్ దొరికితే తెలుగులో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని అశ్వినీదత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సినిమా ద్వారా జాన్వీని తెలుగుప్రేక్షకులకు పరిచయం చేయాలనీ చూస్తున్నారు.
మరి ఈ ముద్దుగుమ్మ తెలుగు లో నటించడానికి సిద్ధంగా ఉందా లేదా అన్నాడని పైన ఇంతవరకు క్లారిటీ రాలేదు.