Anil Ravipudi: సుందరకాండ తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో అలా కనిపించనున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన అనిల్ రావిపూడి

భగవంత్ కేసరి ఫిల్మ్ మేకర్స్ గా నేను చాలా తృప్తి పొందిన సినిమా. అంతే తృప్తిని ఇచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం. జోనర్, స్క్రిప్ట్, రైటింగ్ పరంగా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

Anil Ravipudi: సుందరకాండ తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో అలా కనిపించనున్నారు.. ఆసక్తికర విషయం చెప్పిన అనిల్ రావిపూడి
Anil Ravipudi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2024 | 8:33 PM

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ యంగ్ డైరెక్టర్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో కలిసి సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రయూనిట్ తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సంక్రాంతి వస్తున్నాం జనవరి 14న మీ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి నాకు స్పెషల్ కనెక్షన్ వుంది. సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 హ్యుజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ గారితో చేసిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారితో, నాకు ఇష్టమైన దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్ లో మీ అందరినీ నవ్వించడానికి సంక్రాంతి వస్తున్నాంతో వస్తున్నాం అన్నారు.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

భగవంత్ కేసరి ఫిల్మ్ మేకర్స్ గా నేను చాలా తృప్తి పొందిన సినిమా. అంతే తృప్తిని ఇచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం. జోనర్, స్క్రిప్ట్, రైటింగ్ పరంగా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటీఫుల్ జర్నీ. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. వెంకటేష్ గారు, నా కాంబినేషన్ హ్యాట్రిక్ ఫిల్మ్ గా రాబోతోంది. లుక్, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా టైం స్పెండ్ చేశాం. సుందరకాండ తర్వాత వెంకటేష్ గారు కంప్లీట్ గ్లాసెస్ తో చేసిన సినిమా ఇది. ఇందులో క్లైమాక్స్ లో వన్ మ్యాన్ షో వుంటుంది. అది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

ఐశ్వర్య రాజేష్ పాత్ర మీకు గుర్తుండిపోతుంది, మీనాక్షి లో చాలా మంచి ఫన్ టైమింగ్ వుంది. అలాగే ఈ సినిమాలో చేసిన నరేష్ గారితో పాటు అన్నీ పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయి. రాజు గారి బ్యానర్ అంటే నా బ్యానర్ లా ఫీల్ అవుతుంటాను. వారితో నా ఐదు సినిమా ఇది. సంక్రాంతి కి సినిమా పెద్ద హిట్ కావాలి. రాజు గారి నుంచి మరో సినిమాగా వస్తున్న రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఇంకా పెద్ద హిట్ కావాలి. అలాగే నా హీరో బాలయ్య బాబు గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. అన్ని జోనర్ సినిమాలు వున్నాయి. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి’ అని అనిల్ అన్నారు.

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..