Tollywood: ఇంత మార్పు ఎలా అమ్మాయ్.. అప్పుడేమో అమాయకంగా.. ఇప్పుడు సో హాట్ అనేలా

బోల్డ్ గా ఉండే హీరోయిన్స్ లో ముందువరుసలో ఉంటుంది ఈ స్టార్ హీరోయిన్. సింగర్ గానే కాకుండా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. కానీ అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయింది.

Tollywood: ఇంత మార్పు ఎలా అమ్మాయ్.. అప్పుడేమో అమాయకంగా.. ఇప్పుడు సో హాట్ అనేలా
Heroine Childhood Photo
Follow us

|

Updated on: Apr 27, 2024 | 2:01 PM

ఈ పిల్ల ఎవరో గుర్తుపట్టారా…? కొంచెం కష్టం కాబట్టి క్లూ ఇస్తాం. ప్లేబ్యాక్ సింగర్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు అందిపుచ్చుకుంది.  సౌత్ ఇండియాలో హాట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది.  తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగు,  మలయాళంలోనూ మెరిసింది.  ఈ మధ్య ఎందుకో అవకాశాలు తగ్గాయి. అప్పడో సినిమా.. ఇప్పుడో సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఏజ్ 38. అయినా ఎప్పటికీ పెళ్లి చేసుకోనని.. సోలో లైఫే సో బెటర్ అంటోంది. అయితే అమ్మడు కమల్ హాసన్, అనురుధ్, ధనుష్ వంటి వాళ్లతో రిలేషన్‌లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మీరు ఇంకా గుర్తు పట్టలేదా..? అయితే మేమే చెప్పేస్తాం. తను ఆండ్రియా జెరెమియా.

గాయనిగా సినిమాల్లోకి వచ్చిన ఆండ్రియా  మంచి డ్యాన్స్, అలానే మ్యూజిక్ కంపోజర్, మోడల్ కూడా. ఆండ్రియా 8 సంవత్సరాల వయసులో పియానో ​​నేర్చుకోవడం షురూ చేసింది. పదేళ్ల వచ్చినప్పుడు “యంగ్ స్టార్స్” అనే మ్యూజిక్ బ్యాండ్‌లో చేరింది. తన కాలేజీ రోజుల్లో పలు నాటకాల్లో కూడా నటించింది. అలాగే లైవ్ ఆర్ట్, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి..  ది షో మస్ట్ గో ఆన్ అనే కంపెనీని కూడా ప్రారంభించింది. 2005లో ప్లే బ్యాక్ సింగర్ గా వచ్చిన ఆండ్రియా..  యువన్ శంకర్ రాజా, హారిస్ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్,  జి.వి. ప్రకాష్ కుమార్ వంటి సంగీత దర్శకులతో పని చేసింది. తెలుగులో సునీల్ కు జోడీగా తడాఖా అనే మూవీలో నటించింది. లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో ఈ ముద్దుగుమ్మ నటించిన విషయం తెలిసిందే.

తానే సాంగ్స్ రాసి.. మ్యూజిక్ అందించిన సోల్ ఆఫ్ తారామణి ఆల్బమ్ మంచి హిట్ అయింది. ఆండ్రియా 250కి పైగా సినిమా పాటలు పాడింది. కొంతకాలం నుంచి ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. మధ్యలో వివాదాలు చుట్టుముట్టడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తాను 20 నుంచి 25 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నానని.. కానీ ఆ సమయంలో వర్కువుట్ అవ్వలేని… ఇప్పుడు ఒంటరి అలవాటు అయిపోయిందని చెప్తోంది. ఆమె నటించిన డెవిల్ 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ
'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ
రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే ..
రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే ..
క్రెడిట్ స్కోర్ తక్కువున్నా పర్లేదు.. ఇలా చేస్తే పర్సనల్ లోన్
క్రెడిట్ స్కోర్ తక్కువున్నా పర్లేదు.. ఇలా చేస్తే పర్సనల్ లోన్
ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలా చెయ్యాల్సి వచ్చింది. కాజల్ కామెంట్స్
ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలా చెయ్యాల్సి వచ్చింది. కాజల్ కామెంట్స్
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. కేంద్ర మంత్రి..
'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. కేంద్ర మంత్రి..
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!