- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan, Prabhas and Nagarjuna to play police character in their upcoming movies Telugu Heroes Photos
Police Character: పవర్‌స్టార్ టు కింగ్.. ఖాకీలో కనిపించబోయేది ఎవరు.?
హీరోలు ఎన్ని రకాల రోల్స్ చేసినా, లైట్ గ్రే షేడ్స్ లో కనిపించే రోల్స్ కీ, ఫుల్ ఫోర్స్ తో ఖాకీ చొక్కాలో కనిపించడానికి ఎప్పుడూ యమా క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో కొన్ని హీరోలను ఖాకీ డ్రస్సుల్లో చూపించడానికి రెడీ అవుతున్నాయి. పవర్‌స్టార్ టు కింగ్.. ఖాకీలో కనిపించబోయేది ఎవరు.? కచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం అంటూ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో డైలాగులు చెప్పేటప్పుడు పవన్‌కల్యాణ్ ఉన్నది స్టేషన్‌లోనే..
Updated on: Apr 27, 2024 | 1:44 PM

దాంతో పాటు ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కల్యాణ్ హాజరయ్యే ఫస్ట్ లొకేషన్ ఏదనే విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు జనాలు. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే హరిహరవీరమల్లు ఈ ఏడాదే విడుదలవుతుందా? లేకుంటే 2025 సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయ్యాయి.

కచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం అంటూ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో డైలాగులు చెప్పేటప్పుడు పవన్‌కల్యాణ్ ఉన్నది స్టేషన్‌లోనే.. ఖాకీ డ్రస్‌లోనే. ఆల్రెడీ భీమ్లానాయక్‌లో ఖాకీ దుస్తుల్లో కనిపించిన పవర్‌స్టార్, మరోసారి అదే డ్రెస్‌లో మెప్పించడానికి రెడీ అవుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌లో ప్రభాస్ కూడా ఖాకీ డ్రస్సులోనే కనిపించనున్నారు. సందీప్‌రెడ్డి వంగా సినిమాలో ప్రభాస్ కేరక్టర్‌ని ఏకంగా ఏక్‌నిరంజన్ మూవీ రోల్‌తో పోల్చి చూసుకుంటున్నారు జనాలు. ఆ కేరక్టర్‌కి నయా వెర్షన్‌లా ఉంటుందేమో అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ రెబల్ స్టార్ మాత్రమే కాదు, టాలీవుడ్ కింగ్ కూడా ఇప్పుడు ఖాకీ మీద మోజుపడ్డారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న సినిమా కుబేర. ఈ మూవీలో కింగ్ నాగ్ పోలీస్ కేరక్టర్ చేస్తున్నట్టు టాక్.

గతంలో బంగార్రాజు, నా సామిరంగా లాంటి సినిమాల్ని 3 నెలల్లో పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేసారు కింగ్. ఈ సారి కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తారేమో చూడాలిక.

బిగ్ బాస్ 3 నుంచి నాగార్జున హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నారు. కనీసం 3 నెలలు ఈ షోపై ఫోకస్ చేస్తారీయన. ఈ లెక్కన సెప్టెంబర్ తర్వాతే నాగ్ కొత్త సినిమా ఉండబోతుంది.




