Ramayan Movie: సీతారాములుగా ఆ ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో.. రామాయణ నుంచి రణబీర్, సాయిపల్లవి ఫోటోస్ లీక్..
భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటికే రామాయణంపై అనేక సినిమాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి రామాయణాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అలాగే రావణిడిగా యష్ కనిపించనున్నాడు. సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ అందరూ ఈ రామాయణంలో భాగం కావున్నారు.