ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా ఆవేశం. సామాన్యులే కాదు, సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కు టచ్ చేసింది. తాజాగా కేరళ బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల మార్కును క్రాస్ అయింది. కేరళలో ఈ గౌరవాన్ని పొందిన 12వ సినిమా ఇది అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేకర్స్.