Bigg Boss 5: బిగ్‌బాస్ ఆఫర్‌కు నో చెప్పిన బబ్లీ బ్యూటీస్.. నిరాశలో అభిమానులు. కారణం అదేనా..?
Bigg Boss 5: బిగ్‌బాస్ 5వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. త్వరలోనే బుల్లి తెర మళ్లీ సందడిగా మారనుంది. ఇకపై రాత్రి 9 అయ్యిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడం...

Bigg Boss 5: బిగ్‌బాస్ 5వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. త్వరలోనే బుల్లి తెర మళ్లీ సందడిగా మారనుంది. ఇకపై రాత్రి అయ్యిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, వారు నవ్వులు, ఏడుపులు ఆడియన్స్‌ను చూపుతిప్పుకోనివ్వవు. ఈ క్రమంలోనే ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులు షో ప్రారంభానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్‌ల జాబితాను సిద్ధం చేసిన షో నిర్వాహకులు వారిని మరికొన్ని రోజుల్లో క్వారంటైన్‌కు తరలించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించిన ప్రతీ చిన్న అంశం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్ షోకు సంబంధించి మరో వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి హౌజ్‌లో గ్లామర్ డోస్‌ను పెంచే క్రమంలోనే నిర్వాహకులు అందాల ముద్దుగుమ్మలను తీసుకునే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే యాంకర్ వర్షినితో పాటు సింగర్ మంగ్లీని కూడా తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. మంగ్లీ ఫొటో షూట్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ నిర్వాహకుల ప్రతిపాదననను ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సున్నితంగా తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. మంగ్లీ కొత్త కొత్త పాటలను విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బిగ్‌బాస్ షోకు నో చెప్పిందని టాక్ నడుస్తోంది. ఇక యాంకర్‌గా కెరీర్‌లో నిలదొక్కుకుంటోన్న వర్షిని కూడా పలు షోలతో బిజీగా ఉన్న కారణంగానే బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీకి నిరాకరించిందని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: చిన్న వయసులోనే స్టెప్పులేసిన ఈ చిన్నది.. ఇప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి.. ఎవరు తెలుసా
AR Rahman: నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా..? అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన రెహమాన్.




