AR Rahman: నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా..? అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందించిన రెహమాన్.
AR Rahman: దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తన అద్భుత ట్యాలెంట్‌తో ఆస్కార్ అవార్డును సొంతం...
AR Rahman: దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తన అద్భుత ట్యాలెంట్‌తో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక తెర వెనక ఉంటూ సినిమాకు ప్రాణం పోసే రెహమాన్ ఇప్పటి వరకు తెరపై కనిపించింది చాలా అరుదని చెప్పాలి. కొన్నిసార్లు ప్రత్యేక గీతలను ఆలపించే క్రమంలో స్క్రీన్‌పై కనిపించిన రెహమాన్ సినిమాలో మాత్రం కనిపించలేదు. దీంతో రెహమాన్ సినిమా ఎంట్రీపై గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. అయితే రెహమాన్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ క్రమంలోనే తాజాగా అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా రెహమాన్‌ను ఇదే ప్రశ్న అడిగాడు. ‘నటుడిగా మీ ఎంట్రీ ఎప్పుడు ఉండనుంది సార్’ అని ప్రశ్నించగా.. రెహమాన్ ఆసక్తికర రిప్లై ఇచ్చారు. ‘నేను ఇప్పటి వరకు ఉన్నట్లు ప్రశాంతంగా ఉండాలని నీకు ఇష్టం లేదా’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. దీంతో తనకు సినిమాల్లో నటించాలనే ఉద్దేశం అస్సలు లేదని రెహమాన్ చెప్పకనే చెప్పాడన్నమాట. దీంతో రెహమాన్‌ను హీరోగా చూడాలనుకుంటున్న ఆయన అభిమానులకు నిరాశే మిగిలింది. మరి భవిష్యత్తులో ఎవరైనా దర్శకుడు పట్టుబడితే రెహమాన్ వెండి తెర ఎంట్రీ సాధ్యమవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే రెహమాన్ ప్రస్తుతం.. తమిళంలో పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.