సుమక్కా..నీ అందం సీక్రెట్ చెప్పవూ..!

టీవీ ప్రొగ్రామ్స్‌లో, ఇంటర్వ్యూలలో, ఆడియో ఫంక్షన్స్‌లో అందరి గురించి ఇంట్రోలు ఇచ్చే సుమక్క గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. సింపుల్‌గా చెప్పాలంటే… షి ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్..షి ఈజ్ ఎవర్ లవబుల్. సుమక్క..సుమక్క అంతే. ఆవిడ ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల కుటుంబ సభ్యురాలు అయిపోయింది. ఏ ఛానల్ పెట్టినా సుమక్క కనపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య డబుల్ హార్స్ మినపగుండ్లు లాంటి యాడ్స్‌లో కూడా కనిపిస్తుందండోయ్. ఇక ఆమె మాటలు గురించి ఏం చెప్పాలి. అసలు […]

సుమక్కా..నీ అందం సీక్రెట్ చెప్పవూ..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 16, 2020 | 5:05 PM

టీవీ ప్రొగ్రామ్స్‌లో, ఇంటర్వ్యూలలో, ఆడియో ఫంక్షన్స్‌లో అందరి గురించి ఇంట్రోలు ఇచ్చే సుమక్క గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. సింపుల్‌గా చెప్పాలంటే… షి ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్..షి ఈజ్ ఎవర్ లవబుల్. సుమక్క..సుమక్క అంతే. ఆవిడ ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల కుటుంబ సభ్యురాలు అయిపోయింది. ఏ ఛానల్ పెట్టినా సుమక్క కనపిస్తూనే ఉంటుంది. ఈ మధ్య డబుల్ హార్స్ మినపగుండ్లు లాంటి యాడ్స్‌లో కూడా కనిపిస్తుందండోయ్. ఇక ఆమె మాటలు గురించి ఏం చెప్పాలి. అసలు ఆమె మళయాళి అమ్మాయి అంటే ఎవరైనా నమ్ముతారా..? స్టార్ట్ చేసిందంటే చాలు..గంగా ప్రవాహంలా ఆమె మాటల గారడీ కొనసాగుతూనే ఉంటుంది.

బుల్లితెరపై యాంకర్ సుమ లేడీ సూపర్ స్టార్. అయితే ఎప్పుడూ షూటింగ్స్‌లో బిజీగా ఉండే ఆమె..ఫ్యామిలీకి కూడా ఎక్కువగా సమయం కేటాయిస్తూ గృహిణిగా కూడా సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది. 1999లో నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న సుమకు ఇద్దరు పిల్లలు. కొడుకు రోషన్ కాగా, కుమార్తె మనస్విని. రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ మూవీలో యాక్ట్ చేశాడు. అతని తాతగారు దేవదాస్ కనకాల చిరంజీవి లాంటి నటుల్ని తీర్చిదిద్దిన గురువు కాబట్టి కుర్రోడి యాక్టింగ్‌కి వంక పెట్టాల్సిన పనిలేదు. అయితే ‘నిర్మలా కాన్వెంట్’ సమయంలో రోషన్ ఏజ్ చాలా తక్కువ. ఇప్పుడు అతగాన్ని చూస్తే సుమక్క కొడుకు అంటే ఎవరూ నమ్మరు. ఆదివారం రోజు సుమ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడితో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో రోషన్ కటౌట్ ఆశ్యర్యం కలిగించక మానదు.  ‘‘నా  రోషన్ పెద్దవాడయ్యాడు. బలంగా తయారయ్యాడు. లవ్ యు రా’’ అని సుమ ఆ ఫోటోకి కొటేషన్ కూడా ట్యాగ్ చేశారు. దీంతో చాలామంది రోషన్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.