బాలీవుడ్ స్టార్ హీరోకి అల్లు అర్జున్ కుమారుడి స్పెషల్ రిక్వెస్ట్..
అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయారు. షూటింగ్ నుంచి విరామం దొరికితే చాలు తన భార్యాపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇటీవలే తన కుమారుడు అల్లు అయాన్ ప్రీ స్కూల్ గ్రాడ్యూయేషన్ వేడుకలను ఉద్దేశించి ఓ ట్వీట్ వేశాడు బన్నీ. అయాన్‌ను చూసి ఎంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. దీనిపై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ స్పందించాడు. అయాన్‌కు శుభాకంక్షలు తెలుపుతూ కామెంట్ పెట్టాడు. టైగర్ ష్రాప్ కామెంట్‌పై స్పందించిన స్టైలిష్ స్టార్.. “థాంక్యూ బ్రదర్, […]
అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్‌గా మారిపోయారు. షూటింగ్ నుంచి విరామం దొరికితే చాలు తన భార్యాపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇటీవలే తన కుమారుడు అల్లు అయాన్ ప్రీ స్కూల్ గ్రాడ్యూయేషన్ వేడుకలను ఉద్దేశించి ఓ ట్వీట్ వేశాడు బన్నీ. అయాన్‌ను చూసి ఎంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. దీనిపై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ స్పందించాడు. అయాన్‌కు శుభాకంక్షలు తెలుపుతూ కామెంట్ పెట్టాడు.
టైగర్ ష్రాప్ కామెంట్‌పై స్పందించిన స్టైలిష్ స్టార్.. “థాంక్యూ బ్రదర్, నీ మెసేజ్ చూసి అయాన్ చాలా ఆనందపడుతున్నాడు” అని పేర్కొన్నాడు. ఆ తర్వత అయాన్, టైగర్ ష్రాప్‌ను “టైగర్ స్క్వాష్” అని సంబోధిస్తూ ఓ సందేశం కూడా పంపించాడు. “హాయ్ టైగర్ స్క్వాష్, బాగీ 3 షూటింగ్ కోసం నన్ను ఆహ్వానించగలరా?” దీనికి అల్లు అర్జున్ ఎందుకని ప్రశ్నించగా, “నేను అతని బాడీ, తుపాకీ పోరాట దృశ్యాలను చూడాలనుకుంటున్నాను” అని సమాధానం ఇచ్చారు.
కాగా ఈ పొంగల్‌కి ‘అల వైకుంఠపురములో’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన బన్నీ బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటించనున్న మూవీ ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ థీమ్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.